Kumari Aunty: రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు ‘కుమారీ ఆంటీ’. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుండి హైదరాబాద్ సిటీ కి వచ్చిన ఈ సామాన్యురాలు సృష్టించిన అసాధారణమైన సంచలనం మామూలుది కాదు. ఫుడ్ బిజినెస్ తో హైదరాబాద్ లో ఒక ప్రభంజనమే సృష్టించింది. ఈమె ఫుడ్ కోసం హైదరాబాద్ పరిసరాల్లోని జనాలు మొత్తం తెల్లవారు జాము నుండి కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ లో నిల్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు గతం లో మనం చాలానే చూసాము. ఈమె ఫుడ్ స్టాల్ కి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించాడు, సినీ సెలబ్రిటీలు కూడా ఈమె ఫుడ్ కోసం ఎగబడుతుంటారు. అలాంటి ఫేమ్ , క్రేజ్ ని సంపాదించుకుంది కుమారి ఆంటీ. ఈమెకు ఉన్నటువంటి ఫేమ్ కారణంగా ఈమధ్య కాలం లో కొన్ని టీవీ షోస్ లో కూడా కనిపిస్తోంది.
కొన్ని సినిమాల ప్రొమోషన్స్ లో కూడా ఈమె ఈమధ్య కాలం లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆమె ఒక ప్రత్యేక పాత్ర ద్వారా వెండితెర అరంగేట్రం చేయబోతుంది. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ‘పాంచాలి పంచభతృకా’ అనే చిత్రం లో కుమారీ ఆంటీ ఒక కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. రాయల్ ధ్రోన్ ప్రొడక్షన్స్ , ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి , రాజ్ పవన్ శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మణ్యం వంటి వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యం లో రీసెంట్ గానే హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి కుమారీ ఆంటీ కూడా పాల్గొన్నది. ఈ ఈవెంట్ లో తన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి కుమారీ ఆంటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఈ సినిమా టికెక్ట ని కొనుగోలు చేసి , తన్న వద్దకు ఆ టికెట్ ని చూపించే వాళ్లకు బిల్లు పై 100 రూపాయిల డిస్కౌంట్ ఇస్తానని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో నటిస్తానని తానూ ఎప్పుడూ అనుకోలేదని, అలాంటి నాకు ఈ చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. మరి ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.