Gautam Adani: అదానీ గ్రూప్ సంస్థలపై ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిండెన్ బర్గ్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించినప్పుడు ఇలానే హడావిడి జరిగింది. అంతకుముందు ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల కేటాయింపు.. అక్కడి నుంచి తీసుకువచ్చే బొగ్గును మన దేశ ప్రభుత్వ విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసే విధానం.. వంటి వాటిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య శ్రీలంకలో అదానీ గ్రూప్ చేపట్టిన వ్యాపార కార్య కాలాపాలపై కూడా విమర్శలు వచ్చాయి. అవి ఏకంగా శ్రీలంక పార్లమెంట్ ను స్తంభింప చేశాయి. అయితే తన వ్యాపార విస్తరణకు అదాని అడుగులు వేసిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అవి జాతీయ మీడియాలో, గ్లోబల్ మీడియాలో ప్రధాన వార్తలుగా ప్రసారం, ప్రచురితం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కొంతసేపు బ్యాక్ అవుతున్న అదానీ గ్రూప్.. ఆ తర్వాత బౌన్స్ అవుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పుడు తాజాగా అదానీ గ్రీన్ ఎనర్జీలో జరిగిన వ్యవహారాలు.. దానిపై న్యూయార్క్ అధికారులు నమోదు చేసిన అభియోగాలు మాత్రమే కొత్తవి.. ఆరోపణలు మాత్రమే కొత్తవి. మిగతా వ్యవహారాలు మొత్తం పాతవే. అందుకే గౌతమ్ ఆదాని గ్రూప్ తనకు పూర్తిస్థాయిలో నష్టం జరగక ముందే వెంటనే రెస్పాండ్ అయింది. చట్టాల ప్రకారమే తమ నడుచుకుంటామని.. తమపై మోపిన అభియోగాలు మొత్తం పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది.. అయితే శుక్రవారం ఆదాని గ్రూపు లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులు భారీగానే నష్టపోయినప్పటికీ.. అత్తమ్మ మళ్ళి వారు కోలుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మీడియా సృష్టి మాత్రమే..
ఆదాని వ్యవహారంలో ఏదో జరిగిపోతుందని ఓ వర్గం మీడియా ఇవాళ వార్తలు రాసుకొచ్చింది. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేకపోయినప్పటికీ.. మీడియా ఏకంగా విచారణ బాధ్యతను స్వీకరించింది.. అదే ఇక్కడ విస్మయాన్ని కలిగిస్తోంది. అదానీ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి 100 కోట్ల విరాళం ఇవ్వడాన్ని ఓ పార్టీ, ఓ పత్రిక తప్పు పట్టింది. దావోస్ లో 12 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకోవడం కూడా ముమ్మాటికి తప్పు అని తీర్మానించింది. అంతేకాదు న్యూయార్క్ అధికారులు విచారణ జరిపితే అదాని జైలుకెళ్తాడని.. రేవంత్ కూడా కటకటాల లెక్కబెడతాడని ఏకంగా తీర్మానించింది. ఇక జగన్ విషయంలోనూ ఓవర్గం మీడియా ఇదే విధంగా రాసింది.. ఏకంగా జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు లంచాలుగా తీసుకున్నారని.. ఇప్పుడు న్యూయార్క్ పోలీసులు మోపిన అభియోగాలు అవేనని ఒకడగుముందు కేసి రాసింది. కాకపోతే అదానీ విషయంలో కేంద్రమే బలమైన స్టాండ్ తీసుకుంది. అదాని బాధిత పక్షమని అంతర్గతంగా స్పష్టం చేస్తోంది. దానికి జాతీయవాదాన్ని కూడా తొడిగేసింది. అలాంటప్పుడు రాజకీయ రంగులు పులుముకున్న మీడియా సంస్థలు రాసిన వార్తలకు సార్థకత ఏముంటుంది. తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యక్తులపై చేసిన వ్యతిరేక ప్రచారానికి అర్థం ఏమంటుంది.. ఇక్కడ కేంద్రం బలమైన స్టాండ్ తీసుకుని ఉన్నప్పుడు.. అటు రేవంత్, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఏదీ కాదు. ఒకవేళ వీరిపై ఏవైనా చర్యలు తీసుకోవాలి అంటే.. ముందు ఆదాని అక్రమాలను న్యూయార్క్ అధికారులు నిరూపించాలి. ఆయనను శిక్షించాలి. ఆ తర్వాత నాడు ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైల్లో వేయాలి. రాస్తుంటేనే ఇంత సుదీర్ఘంగా ఉన్నప్పుడు.. దీనిని వాస్తవంలోకి తీసుకురావాలంటే ఇంకెంత ప్రయాస ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ న్యూయార్క్ అధికారులను తప్పు పట్టడానికి లేదు. ఆదాని గ్రూపును శుద్ధపూస అని చెప్పడానికి లేదు… మొత్తంగా మన దగ్గర చట్టాల్లో ఎన్నైతే లూప్ హోల్స్ ఉన్నాయో.. అమెరికాలో కూడా ఉన్నాయి. కాకపోతే న్యూయార్క్ అధికారులు మోపిన అభియోగాలను మీడియా హైలెట్ చేస్తుంది కాబట్టి ఆదాని విషయంలో హడావిడి జరుగుతోంది. అంతేతప్ప ఊది కాలేది లేదు. పీరి లేచేది లేదు..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Central government key decision in adani case same as in case of revanth and jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com