Homeఆంధ్రప్రదేశ్‌Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు ఈడి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ కేసు తుది దశకు వచ్చినట్టే. జగన్మోహన్ రెడ్డి […]

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు ఈడి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ కేసు తుది దశకు వచ్చినట్టే. జగన్మోహన్ రెడ్డి భయం కూడా అదే. అందుకే ఇప్పుడు ఆయన కేంద్ర పెద్దలను ఆశ్రయించినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

* భారీ మద్యం కుంభకోణం..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 3800 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా అంతకుమించి అన్నట్టు పరిస్థితి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు అయినా డిజిటల్ లావాదేవీల రూపంలో జరుగుతున్నాయి. అటువంటిది వైసిపి హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు జరగలేదు. దీని వెనుక భారీగా మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈడి రంగప్రవేశం చేసింది. అయితే ఇప్పుడు అదే ఈడి ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విచారణకు పిలిచేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవు.

* ఆ భయంతోనే..
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను ఆశ్రయించినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఎప్పుడైతే ఈడి ప్రవేశం ముందు అప్పటినుంచి జగన్ లో ఒక రకమైన భయం ఏర్పడింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు ఆదేశించింది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో.. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగం అని ప్రచారం సాగింది. కానీ ఇందులో కీలకమైన ఆర్థిక ఆధారాలు, రుజువులు దొరకడంతో ఈడి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డిలో భయం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.. అందుకే కేంద్ర పెద్దలను ఆశ్రయించినట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper