Homeటాప్ స్టోరీస్gold rate today: తులం బంగారం లక్ష? ఎందుకీ క్రాష్.. ఏం జరిగింది..

gold rate today: తులం బంగారం లక్ష? ఎందుకీ క్రాష్.. ఏం జరిగింది..

gold rate today: బంగారం ధర మొన్నటిదాకా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోయింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బంగారం కొనకండి అయ్యా బాబు అని చెప్పాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ మాట విని చాలామంది బంగారం కొనలేదు. ఒకవేళ కొనుగోలు జరిగినప్పటికీ అవి తక్కువ స్థాయిలోనే. నిన్నటిదాకా బంగారం ధర ఆకాశంలోనే విహరించేది. కానీ ఒక్కసారిగా మార్పు వచ్చింది. ధర పతనమైంది. బంగారం మాత్రమే కాదు.. వెండి […]

gold rate today: బంగారం ధర మొన్నటిదాకా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోయింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బంగారం కొనకండి అయ్యా బాబు అని చెప్పాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ మాట విని చాలామంది బంగారం కొనలేదు. ఒకవేళ కొనుగోలు జరిగినప్పటికీ అవి తక్కువ స్థాయిలోనే. నిన్నటిదాకా బంగారం ధర ఆకాశంలోనే విహరించేది. కానీ ఒక్కసారిగా మార్పు వచ్చింది. ధర పతనమైంది. బంగారం మాత్రమే కాదు.. వెండి కూడా నేల చూపులు చూస్తోంది

భారతీయులకు బంగారం అంటే విపరీతమైన ఇష్టం. బంగారాన్ని కేవలం నగల కోసం మాత్రమే కాకుండా పెట్టుబడికి సాధనంగా ఉపయోగిస్తుంటారు. కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక భరోసాగా భావిస్తూ ఉంటారు. అందుకే బంగారం ధరలు పెరిగినా. తగ్గినా సామాన్యుల నుంచి మొదలుపెడితే ఇన్వెస్టర్ల వరకు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అయితే 2026 లో బంగారం.. వెండి మార్కెట్లలో ధరల మార్పులు విపరీతంగా చోటుచేసుకున్నాయి. దీంతో పెట్టుబడుదారులు ఆలోచనలో పడ్డారు. ఒకప్పుడు రికార్డు స్థాయి చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు ఎందుకు ఇలా నేలచూపులు చూస్తున్నాయి.. వెండి ధరలు కూడా ఎందుకు పడిపోతున్నాయి.. ఈ పతనం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని భావించే వారికి 2026 లో ఊహించని పరిణామం ఎదురైంది. ఒకప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పడిపోతున్నాయి. వెండి పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. నవంబర్ 20న దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం ధర దాదాపు నాలుగు శాతం పడిపోయింది. వెండి ధర దాదాపు ఆరు శాతం క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది.

నవంబర్ 20న ఎంసీఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు సుమారు 1,22,561 కు పడిపోయింది. వెండి ఫ్యూచర్స్ కిలోకు సుమారు 1,48, 050 కి తగ్గిపోయింది. అంతకుముందు రోజు ముగింపు ధరలతో పోలిస్తే బంగారం దాదాపు 4891.. వెండి 9432 రూపాయలు తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం 10 గ్రాములకు సుమారు 1.83 లక్షల గరిష్ట స్థాయిని అందుకుంది. వెండి కూడా 4.04 లక్షల స్థాయిని తాకింది. ఆ గరిష్ట స్థాయిలతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఈ రెండు లోహాల ధరలలో భారీ పతనం కనిపిస్తోంది.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యవహారం. అమెరికాలో ధరల స్థాయి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. దీంతో వడ్డీరేట్లు తగ్గే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. అవసరమైతే వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ అధికారులు సంకేతాలు ఇస్తున్నారు.

ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకు డిపాజిట్లు.. బాండ్లు వంటి వడ్డీ ఆదాయం ఇచ్చే పెట్టుబడుల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉండదు. దీంతో ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడులను తగ్గించి ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పసిడి ధరల మీద ఒత్తిడి పెరుగుతోంది.

బంగారం.. వెండి అంతర్జాతీయ మార్కెట్లో ప్రధానంగా అమెరికా డాలర్లలోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడం ఖరీదు అవుతుంది. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. మనదేశంలో తులం బంగారం ధర లక్ష వరకు పడిపోవచ్చని కూడా తెలుస్తోంది.

నవంబర్ 20 నాటికి డాలర్ ఇండెక్స్ 19 నెల గరిష్ట స్థాయికి సమీపంలో ఉండడం కూడా బంగారం.. వెండి ధరల మీద ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపడంతో పసిడి మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది.

బంగారం ధరలు పడిపోవడానికి మరో కారణం అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడి అధికంగా ఉండడం. సాధారణంగా బాండ్లపై వచ్చే వడ్డీ రాబడి పెరిగితే పెట్టుబడిదారులు బంగారం కంటే వాటిపై ఆసక్తి చూపుతారు. ఎందుకంటే బంగారం ధర పెరిగితే పెట్టుబడిదారులకు లాభం వస్తుంది. కానీ బాండ్ల ద్వారా నిర్ణీత వడ్డీ ఆదాయం లభిస్తుంది.. ప్రస్తుతం అమెరికాలో ధరలపై ఆందోళనలు.. వడ్డీ రేట్ల అంచనాలు బాండ్ల రాబడి మీద ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామం బంగారంపై పెట్టుబడుల ఆకర్షణను పూర్తిగా తగ్గిస్తోంది.

2025, 2026 ప్రారంభంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ముందుగానే పెట్టుబడులు పెట్టిన వారు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని ప్రాఫిట్ బుకింగ్ అని పిలుస్తుంటారు. మరోవైపు షేర్ మార్కెట్లో నష్టాలు ఎదుర్కొంటున్న కొంతమంది ఇన్వెస్టర్లు నగదు సమీకరించడానికి బంగారం.. వెండి వంటి ఆస్తులను కూడా విక్రయిస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ధరలు పడిపోవడంతో తమ స్థాయిలను తగ్గించడం కూడా అమ్మకాల ఒత్తిడిని పెంచుతోంది.

వెండి విషయంలో కూడా మరో ప్రత్యేకమైన అంశముంది. బంగారం ప్రధానంగా పెట్టుబడి.. ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. వెండికి సౌర విద్యుత్ ప్యానల్స్.. ఎలక్ట్రానిక్స్.. పారిశ్రామిక రంగాలలో వినియోగిస్తారు. పారిశ్రామిక డిమాండ్ మీద ఆందోళనలు పెరిగితే వెండి ధరలు నేలచూపులు చూస్తాయి.

బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ముఖ్యంగా పెళ్లిలో సీజన్లో ఆభరణాలు కొనాలని అనుకుంటున్నా వారికి విదల పతనం కొంతమేర ఊరట ఇస్తుంది. అయితే ఇప్పుడు ధరలు తగ్గాయని భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే.. మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత అవసరం. వచ్చే రోజుల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ రిజర్వు నిర్ణయాలు.. డాలర్ విలువ.. అంతర్జాతీయ స్థాయిలో ధరల స్థాయి.. కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper