YS Jagan: వచ్చే ఎన్నికల్లో చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపి కూటమిని ఎదుర్కోవడం పెద్ద సాహసం. అంతకుమించి సొంత వారిపై జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాటం చేయాల్సి ఉంటుంది.. ఇప్పటివరకు తన సొంత వారిగా భావిస్తున్న సునీత, షర్మిల తనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో విజయసాయిరెడ్డి చేరారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థుల సంఖ్య పెరుగుతుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి అంత సులువు కాదు. గట్టిగానే పోరాటం చేస్తే తప్ప దొరకదు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం పై తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తే కానీ ఆ పరిస్థితి రాదు. అయితే ఆ పరిస్థితిని చేరుకునే క్రమంలో కచ్చితంగా సొంత వారు ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీ కాదు.
* కూటమికి అదే సానుకూలత..
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కూటమి కొనసాగుతుంది. దీనిపై స్పష్టత కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును వ్యతిరేకించరు. భారతీయ జనతా పార్టీ కూడా సహకారం అందిస్తుంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ లాంటి రాష్ట్రంలో మిత్రపక్షం ద్వారా ఎంపీ సీట్లు పెంచుకోవాలని గట్టిగానే చూస్తోంది బిజెపి. అలాంటప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవకాశం ఇవ్వదు. మరింత పట్టు బిగించగలదు. అదే జరిగితే కూటమికి అరకొర స్థానాలు తగ్గవచ్చు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలం పుంజుకునే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* సొంత వారితో ఇబ్బందులే..
ఒకవేళ సాధారణ వ్యతిరేకత ప్రభుత్వంపై ఉండి.. ఎన్నికల నాటికి తీవ్రమైతే మాత్రం ఆ పార్టీ 2014 నాటి పరిస్థితికి చేరుకోగలదు. కానీ ఆ పరిస్థితి రావాలి అనుకుంటే సొంత వారిని అధిగమించాల్సి ఉంటుంది. తప్పకుండా అప్పటికి వివేకానంద రెడ్డి హత్య కేసు అంశం సజీవంగా ఉంటుంది. షర్మిల తో పాటు సునీత ఈ అంశాన్ని గట్టిగానే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే దీని ప్రభావంతో కడప జిల్లాలో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ తప్పదు అని సర్వేలు కూడా తేల్చి చెబుతున్నాయి. దీనికి తోడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి.. జగన్తో ప్రయాణం చేసి.. ఆయనతో పాటు కేసుల బారిన పడి.. ఆపై ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి మరింత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఇంటి గుట్టును బయట పెడితే రాజకీయంగా డ్యామేజ్ తప్పదు. అదే జరిగితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఇప్పుడున్న స్థానాలు కూడా కష్టమే.
* క్షేత్రస్థాయిలో ఉందా?
ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టు కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంటే మాత్రం.. జనాలు విసిగిపోతే మాత్రం.. 2019 ఫలితాలు వైసీపీకి రావడం ఖాయం. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? అమరావతి కొలిక్కి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతోంది. కొన్ని రకాల ప్రాజెక్టులు పట్టాలెక్కి ఉత్పత్తులు ప్రారంభించాయి. పారిశ్రామిక అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ కళ్ళేదుటే కనిపిస్తుండడంతో.. ప్రజలు వ్యతిరేకించే అవకాశం లేదు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాలన పూర్తయింది. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అమలవుతోంది. ఇటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డికి నో ఛాన్స్.. అవకాశమే లేదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.