No Bag Day : తెలిసి తెలియని వయసులో మానసికంగా ఇబ్బంది పడే విద్యార్థులకు బారేడు బ్యాగుల తో శారీరకంగా కూడా కష్టంగా మారింది. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు శ్రమకు మించిన బరువులు మోస్తూ ఎన్నో అవస్థలు పడుతున్నారు. అయితే ఈ బ్యాగుల బరువుపై విద్యాశాఖ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా.. సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ బ్యాగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నెలలో ఒకరోజు ‘ నో బ్యాగు డే’నిర్వహించాలని నిర్వహించింది. ఈ నో బ్యాగ్ డే అంటే ఏమిటి? ఏడాదిలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బ్యాగు బరువుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతినెల మూడవ శనివారంలో విద్యార్థులు బ్యాగులు స్కూళ్లకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజున నో బ్యాగ్ డే నిర్వహిస్తారు. ఈ విధానం ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఉండనుంది. ఈరోజు నా విద్యార్థులు ఇంటి నుంచి ఎలాంటి పుస్తకాలు తీసుకురాకుండా పాఠశాలలకు రావాలి. ఈరోజు చదువు కాకుండా ఆటలు, సృజనాత్మకత వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. వీటిలో విద్యార్థుల ఆసక్తిని బట్టి కార్యక్రమాలను నిర్వహించే బాధ్యత ఉపాధ్యాయులదే ఉంటుంది. అప్పటివరకు విద్యార్థులు చదువుకున్న వాటిని ప్రాక్టికల్స్ గా అమలు చేయడానికి ఇదొక మంచి అవకాశం గా భావిస్తున్నారు. విద్యార్థులకు కేవలం చదువు ద్వారా మాత్రమే కాకుండా తమ అనుభవాత్మక రూపంలో కూడా నేర్చుకునేందుకు అవకాశం అని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అలాగే ఈ రోజున ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి చిత్రలేఖనం, కథలు చెప్పడం, క్విజ్ వంటి పోటీలు నిర్వహిస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటికి తీసేయాలా ఉపాధ్యాయులు ఆయా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి నెలలో మూడవ శనివారం రోజు నో బ్యాగ్ డే నిర్వహిస్తారు.. అలా ఏడాదికి పది రోజులపాటు ఇవి ఉండనున్నాయి. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 19, నవంబర్ 21, డిసెంబర్ 19, ఫిబ్రవరి 20, మార్చి 20 తేదీల్లో నో బ్యాగ్ డే నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయా పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేయాలని విద్యాశాఖ తెలిపింది. అయితే ఈ రోజుల్లోనే విహారయాత్రలు, క్షేత్ర సందర్శనలు కూడా చేయవచ్చని విద్యాశాఖ తెలిపింది.