YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు అంటే సోషల్ మీడియాకు సరైన వనరు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో కొన్ని తప్పిదాలు దొర్లుతాయి. కొన్ని గణాంకాలను వెనుకేసుకొచ్చే క్రమంలో ఆయన అడ్డంగా దొరికిపోతుంటారు. ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు అరెస్టు విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి అలానే బుక్ అయ్యారు. ఈ అక్రమ అరెస్టు అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించి.. జరిగిన అవినీతికి సంబంధించి.. నగదు మొత్తాన్ని తగ్గించి చెప్పారు.. రెండు కోట్ల రూపాయలు మిగిలి ఉంటుంది.. అంతకుమించి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు ఏమి మిగిలి ఉంటుంది అని ప్రశ్నించడం ద్వారా.. అవినీతి జరిగిందని మాత్రం చెప్పకనే చెప్పారు. ఒప్పుకున్నారు కూడా.
* మద్యం రవాణాలో జరిగిన అవినీతి..
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ మద్యం కుంభకోణంలో తలో పాపం తిలా పిడికెడు అన్నట్టు అప్పట్లో కీలక నేతలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఇలా అందరికీ భాగస్వామ్యం ఉందని అరెస్టుల ద్వారా తెలిసింది. అయితే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పై వచ్చిన ప్రధాన ఆరోపణ. మద్యం రవాణాకు సంబంధించి వాహన చార్జీలను అమాంతం పెంచేసి దోపిడీ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఆయన కుమారుడు పేరుతో రవాణాకు సంబంధించిన ఏజెన్సీ అప్పట్లో మద్యం సరఫరా బాధ్యతలను తీసుకుంది. కిలోమీటర్కు 13 రూపాయలు ఉంటే 30 రూపాయలకు పైగా వసూలు చేశారు అనేది ఆరోపణ. ఒక్క మద్యం రవాణాలోనే 198 కోట్ల రూపాయలు పక్కదారి పట్టింది అనేది ప్రధానాభియోగం. ఇందులో కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫ్యామిలీకి 28 కోట్ల రూపాయల వరకు అక్రమంగా అందింది అనేది ఈడి దర్యాప్తులో తేలిన అంశం. అందుకే గతంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు మాజీ మంత్రిని సైతం ఈడీ అదుపులోకి తీసుకుంది.
* జగన్ స్పందిస్తే తప్పులు..
మాజీ మంత్రి అరెస్ట్ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఇది అసలు కుంభకోణం కాదు అని తేల్చేశారు. ఈడి నమోదు చేసిన కేసు గురించి మాట్లాడుతూ.. మద్యం రవాణాలో ఒక రెండు కోట్లు మిగిలి ఉంటుందో లేదో కానీ.. 28 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అనడం సమంజసం కాదు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఈడి చెప్పినట్టు 28 కోట్లు కాదు.. రెండు కోట్లు మాత్రమే ఉంటుంది అనేది జగన్ నుంచి వచ్చిన మాట. దీంతో మిగతా 26 కోట్లు జగన్ తీసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పరామర్శించే క్రమంలో.. వారిపై సానుభూతి వ్యక్తం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇలాంటి సుభాషితాలు రావడం విశేషం.
View this post on Instagram