Homeఆంధ్రప్రదేశ్‌ED Investigation: ఈడి దూకుడు.. కేంద్ర పెద్దల ఆదేశాలు.. వైసీపీలో టెన్షన్!

ED Investigation: ఈడి దూకుడు.. కేంద్ర పెద్దల ఆదేశాలు.. వైసీపీలో టెన్షన్!

ED Investigation: ఏపీలో పలు సంచలనాత్మక కేసుల్లో ఈడి దూకుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభం అయింది.. గతంలో కేవలం రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేసేవి. కానీ కేంద్రం పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హఠాత్తుగా కొత్త వేగం ప్రదర్శిస్తుంది. ప్రధానంగా మద్యం కుంభకోణంలో.. 195 కోట్ల రూపాయలకు పైగా విలువైన మద్యం అక్రమ రవాణా కేసులు మాజీ […]

ED Investigation: ఏపీలో పలు సంచలనాత్మక కేసుల్లో ఈడి దూకుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభం అయింది.. గతంలో కేవలం రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేసేవి. కానీ కేంద్రం పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హఠాత్తుగా కొత్త వేగం ప్రదర్శిస్తుంది. ప్రధానంగా మద్యం కుంభకోణంలో.. 195 కోట్ల రూపాయలకు పైగా విలువైన మద్యం అక్రమ రవాణా కేసులు మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఇప్పటికీ ఆయన కుమారుడు సునీల్ కూడా అరెస్టయ్యారు. ప్రధానంగా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ లాంటి సంస్థల చుట్టూ ఉచ్చు బిగించడం ఒక ఎత్తు అయితే.. ఏళ్ల తరబడి మూలనపడి ఉందనుకున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీ ట్రయల్ కోణాన్ని ఈడి వెలికితీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* సిబిఐ ను కాదని ఈడి..
వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సిబిఐ చేపడుతోంది. అయితే సంతృప్తికరమైన దర్యాప్తు జరగలేదు అనేది వివేకానంద కుమార్తె సునీత వాదన. ఆమె ప్రతిసారి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. అయితే ఏం చేయలేమన్న నిస్సహాయత సిపిఐ నుంచి వచ్చింది. దీంతో ఈ కేసు క్లోజ్ అయినట్టేనని అంతా భావించారు. కానీ ఇప్పుడు తెరపైకి ఈడి వచ్చింది. కడప ఎంపీ అవినాష్ ఇంట్లో సోదాలు చేసి.. నగదు తో పాటు రెండు డిపాజిట్ లాకర్లను స్వాధీనం చేసుకోవడం.. ఈ కేసును కేవలం హత్య కేసు గానే కాక.. ఫైనాన్షియల్ క్రైమ్ గా మార్చేశాయి. అసలు ఏపీ కేంద్రంగా ఈడి ఈ స్థాయి ఆర్థిక ఉగ్రవాద ఎందుకు వేగవంతం చేసింది? దీని వెనుక ఉన్న అసలైన సంకేతాలేంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తప్పకుండా తెరవెనుక ఏదో ఒక టార్గెట్ ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

* రూ. 40 కోట్ల సుపారీ..
తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడి ఎంట్రీ తో.. ఒక అంశం వెలుగులోకి వచ్చింది. రూ.40 కోట్ల సుపారి చేతులు మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది వ్యవస్థాగతంగా సాగుతున్న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన సాధారణ కేసు అని తెలుస్తోంది. సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులోకి ఈడి రావడం అంటే చిన్న విషయం కాదు. మరోవైపు మద్యం రవాణా టెండర్లను స్థానిక సిండికేట్లకు కట్టబెట్టిన కిలోమీటర్కు 13 ఉండే చార్జిని 35 రూపాయలకు పెంచి.. వైసిపి హయాంలో 195 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అనేది ప్రధాన ఆరోపణ. అయితే మద్యం కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. ఇంకోవైపు ఈడి ఆర్థిక లావాదేవీలతో పాటు నేరపూరిత ఆదాయం, వ్యాపార సామ్రాజ్యాల్లోకి హవాలా లావాదేవీలు, డిజిటల్ నెట్వర్క్ పై దృష్టి పెడుతూ విచారణ చేపట్టింది ఈడి. ఇలా ఏకకాలంలో రెండు కేసులను ఈడి దర్యాప్తు చేపడుతుండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు కారణం. ఢిల్లీ పెద్దల ఆదేశాలు రాకుండా.. ఈడి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. వైసిపి ఆందోళనకు కారణం కూడా అదే. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈడీ దూకుడు చూస్తుంటే విడిచి పెట్టేలా లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper