Motorola edge 60 Pro deal: మోటోరోలా రూపొందించిన కొత్త ఫోన్ ఇది. ఇందులో 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. 256 జిబి స్టోరేజ్ లభిస్తోంది. కాకపోతే ఈ ఫోన్ ప్యాకెట్ ఫ్రెండ్లీగా ఉంది.
- ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను 29,999 ధరకు కొనుగోలు చేయవచ్చు
- బ్యాంకు ఆఫర్ ద్వారా ఈ ఫోన్ 27,549 కి లభిస్తుంది
- ఎక్స్ చేంజ్ ఆఫర్లతో పాత ఫోన్ మీద 2,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
Motorola edge 60 Pro deal: స్మార్ట్ ఫోన్ వాడేవారికి మోటరోలా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ తాజాగా Motorola edge 60 Pro అనే మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జెన్ జెడ్ ను లక్ష్యంగా చేసుకొని ఈ ఫోన్ రూపొందించింది. ఈ మోడల్ మీద కంపెనీ ధర తగ్గించింది. ఈ నేపథ్యంలో ఉత్తమమైన ఫీచర్లు.. మెరుగైన కెమెరా.. అద్భుతమైన బ్యాటరీ కోరుకునే వారికి ఇదే సదావకాశం.
ఈ ఫోన్లో 6000 mAh బ్యాటరీ ఉంది. 90W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో ఫోన్ల ధరలను కంపెనీలు పెంచుతున్నప్పటికీ.. ఈ బ్రాండ్ మీద మోటరోలా ఇంతవరకు ధర పెంచలేదు. ఈ కామర్స్ వేదికలలో ఈ ఫోన్ సరసమైన ధరకు లభిస్తోంది.
ఎక్స్చేంజి ఆఫర్ లభ్యత ఇలా
మోటోరోలా 60 ప్రో ఫోన్ 8gb+ 256gb స్టోరేజ్ బేస్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ లో 29,999 ధరకు లభిస్తోంది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద 2450 తగ్గింపు లభిస్తోంది. తద్వారా ఈ ఫోన్ 27 549 రూపాయలకు వస్తోంది. ఎక్స్చేంజి ఆఫర్ల ద్వారా 2000 వరకు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ఎక్స్చేంజి ఆఫర్ అనేది పాత డివైస్ వర్కింగ్ కండిషన్.. మోడల్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 2712*1220 పిక్సెల్ రిజల్యూషన్, 120 Hz రీ ఫ్రెష్ రేట్, 4500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్, 6.7 అంగుళాల pOLED డిస్ ప్లే ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమన్ సిటీ 8350 ఎక్స్ ట్రిమ్ 4 nm ప్రాసెసర్ తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది.
కెమెరా ఎలా ఉందంటే
ఈ ఫోన్ కెమెరా సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ ఓఐఎస్ సపోర్ట్ తో లభిస్తుంది. ఇందులో 50 మెగా ఫిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఎఫ్/2.0 అపర్చర్ తో 50 మెగా పిక్సెల్ ఫోటో ఫోకస్, అల్ట్రావైడ్ కెమెరా, ఎఫ్/2.0 అపార్చర్ తో టెన్ మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు.. వీడియో కాల్స్ కోసం ఎఫ్/ 2.0 అపార్చర్ తో 50 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంది. ఎడ్జ్ 60 ప్రోలో బ్లూటూత్ 5.4, వైఫై 6e, 5జి, ఎన్ ఎఫ్ సి, జిపిఎస్ వంటి కనెక్టివిటీలు ఉన్నాయి.