YS Jagan Mohan Reddy: ఏపీ శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీ హవా కొనసాగుతూ వస్తోంది. ఆ పార్టీకి చెందిన మోసేన్ రాజు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా శాసనమండలి వైస్ చైర్ పర్సన్ గా ఉన్న జాకీయా ఖానం నిన్ననే ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేశారు. అయితే ఆ పదవి కోసం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పోటీ నడుస్తోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి కులం అనే కార్డును ప్రయోగించారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మాధవరావు అనే ఎమ్మెల్సీకి ఆ పదవి ఇచ్చారు. తద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కొత్త లాజిక్ ను తెరపైకి తీసుకువచ్చారు.
* వారికి మొండి చేయి..
సాధారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది రెడ్డి సామాజిక వర్గం. ఆ వర్గానికి డిప్యూటీ చైర్ పర్సన్ పోస్టు ఇవ్వచ్చు. మరోవైపు పదవీ విరమణ చేస్తున్నది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆవర్గానికైనా కేటాయించవచ్చు. పోనీ కాపు సామాజిక వర్గం చుట్టూ రాజకీయం నడుస్తుండడంతో ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చు. లేకుంటే బిసి నేతకు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించవచ్చు. కానీ ఇవేవీ చేయకుండానే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఎంపిక వెనుక పెద్ద వ్యూహమే ఉంది.
* అధికారంలో ఉన్నప్పుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కమ్మ సామాజిక వర్గంపై విషం చిమ్మారు జగన్మోహన్ రెడ్డి. ఆ సామాజిక వర్గం అంటే కొడాలి నాని అన్నట్టు వ్యవహరించారు. ఆయనకు ఒక రెండున్నర సంవత్సరాల పదవి ఇచ్చి తర్వాత తొలగించారు. అదే సామాజిక వర్గ నేతలతో అస్సలు భర్తీ చేయలేదు. చివరకు అమరావతి రాజధాని ప్రాంతాన్ని కమ్మరావతి అని ప్రచారం చేశారు. దగ్గరుండి ప్రచారం చేయించారు కూడా. కేవలం చంద్రబాబు సామాజిక వర్గం కారణంగానే దానిపై వివక్ష చూపారు. లేనిపోని ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు రాజకీయాల అద్దం కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మాధవరావుకు డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. దీంతో సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తం అవుతోంది.