WhatsApp New Feature: వాట్సాప్.. మెటా సంస్థ రూపొందించిన ఈ సోషల్ మీడియా చాట్ యాప్ రోజు రోజుకూ అప్‌డేట్ అవుతోంది. యూజర్ల సూచనలు, విన్నపాల మేరకు కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. చాలామంది ఇప్పటికీ రెండు వాట్సాప్ అకౌంట్లు కావాలంటే థర్డ్ పార్టీ యాప్స్ లేదా క్లోన్ యాప్స్‌వైపు చూస్తున్నారు. కానీ వాట్సాప్ అధికారికంగా ఇప్పుడు ఒకే యాప్‌లో రెండు వేర్వేరు నంబర్లతో అకౌంట్లు నడపడానికి అనుమతి ఇచ్చేలా మాడిఫై చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మల్టిపుల్ అకౌంట్లు మార్చుకున్నట్టే, ఇక్కడ కూడా సులభంగా స్విచ్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ మల్టిపుల్ అకౌంట్ ఫీచర్ ద్వారా ఒకే మొబైల్‌లో రెండు వేర్వేరు ఫోన్ నంబర్లతో రెండు అకౌంట్లు లాగిన్ చేసుకోవచ్చు. ఒకటి పర్సనల్ నంబర్, మరొకటి ఆఫీస్ లేదా బిజినెస్ నంబర్ అని వేరు చేసుకోవచ్చు. రెండు అకౌంట్లు ఒకేసారి యాక్టివ్‌గా ఉంటాయి. ఒక అకౌంట్‌లో ఉన్నప్పుడు కూడా రెండో అకౌంట్‌కు మెసేజెస్, కాల్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. అవసరమైనప్పుడు సెకన్లలో మార్చుకోవచ్చు. ప్రొఫైల్ పిక్చర్ చూసి ఏ అకౌంట్‌లో ఉన్నామో తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో కొంతకాలంగా ఉంది. ఇటీవల ఐవోఎస్‌లో కూడా విస్తృతంగా రోల్ అవుట్ అయింది. రెండు అకౌంట్లకు వేర్వేరు ఫోన్ నంబర్లు అవసరం. ఒకే నంబర్‌తో రెండు అకౌంట్లు సాధ్యం కాదు.
థర్డ్ పార్టీ యాప్స్‌కన్నా మెరుగు?
గతంలో చాలామంది డ్యుయల్ వాట్సాప్ కోసం అనధికారిక యాప్స్, మాడిఫైడ్ ఏపీకే ఫైల్స్ లేదా యాప్ క్లోనర్లు వాడేవారు. వాటిలో సెక్యూరిటీ రిస్కులు ఎక్కువ. డేటా లీక్ అయ్యే అవకాశం, బ్యాన్ అయ్యే ప్రమాదం, అప్‌డేట్స్ సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు ఉండేవి. అధికారిక ఫీచర్‌తో ఇవన్నీ తప్పుతాయి. ఎండ్–టు–ఎండ్ ఎన్‌క్రిప్షన్, ప్రైవసీ సెట్టింగ్స్, బ్యాకప్ అన్నీ సాధారణ వాట్సాప్‌లాగే ఉంటాయి. ప్రతీ అకౌంట్‌కు వేర్వేరు ప్రొఫైల్ పిక్చర్, అబౌట్, నోటిఫికేషన్ సెట్టింగ్స్, ప్రైవసీ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. చాట్స్ పూర్తిగా వేరుగా ఉంటాయి.
ఎలా యాడ్ చేయాలంటే..
మొదట వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌కు వెళ్లి సాధారణంగా మూడు డాట్స్ లేదా బాటమ్ ట్యాబ్ ద్వారా మీ పేరు పక్కన ఉన్న యాడ్ ఆప్షన్ (ప్లస్ సైన్) లేదా అకౌంట్స్ సెక్షన్‌లో యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. రెండో ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. సెటప్ పూర్తయిన తర్వాత రెండు అకౌంట్ల మధ్య సులభంగా స్విచ్ చేసుకోవచ్చు. ఇది పర్సనల్, ఆఫీస్ నంబర్లు వేరుగా ఉంచుకోవాలనుకునే ఉద్యోగులు, చిన్న వ్యాపారులు లేదా ఫ్రీలాన్సర్లు, రెండు సిమ్‌లు ఉన్నవారు, ఒక నంబర్‌ను కుటుంబం/స్నేహితులకు, మరొకటి అధికారిక పనులకు వాడేవారు, రెండు ఫోన్లు తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. స్టోరేజ్ కూడా ఒకే యాప్‌లో నిర్వహించుకోవచ్చు.
వాట్సాప్‌లో ఈ ఫీచర్ రోజువారీ వాడకంలో చాలా సౌకర్యవంతం. థర్డ్ పార్టీ రిస్కులు లేకుండా సురక్షితంగా రెండు అకౌంట్లు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి. పర్సనల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మరింత సులభం అవుతుంది.