Homeఆంధ్రప్రదేశ్‌Jagan And Sharmila: జగన్ - షర్మిల వైరానికి ముగింపు పలికారు సరే.. తర్వాతి అడుగులు...

Jagan And Sharmila: జగన్ – షర్మిల వైరానికి ముగింపు పలికారు సరే.. తర్వాతి అడుగులు ఎటువైపు?!

Jagan And Sharmila: అందువల్లే కావచ్చు ఎక్స్క్లూజివ్ అంటూ ఏపీ ఎడిషన్ లో వార్తను ప్రచురించాడు..” ఇటీవల ఎన్నికల్లో దారుణమైన ఓటమి వల్ల జగన్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అధ: పాతాళానికి వచ్చాడు. కేంద్రంలో తనకు వ్యతిరేకమైన బిజెపి కూటమి అధికారంలో ఉంది. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. పొరుగున తెలంగాణలోనూ తనకు ఏమాత్రం సరిపడని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఎటు చూసుకున్నా జగన్ ఒంటరినే. ఇన్నాళ్లపాటు తన వద్ద పదవులు పొందిన వారు పక్కకు వెళ్ళిపోతున్నారు.. కష్టకాలంలో అండగా ఉండాల్సిన వారు దూరం జరుగుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి సపోర్ట్ కావాలి. తన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతోంది. ఆమెతో కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాల విషయంలోనూ విభేదాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల తో సయోధ్యకు జగన్ ఓకే అన్నాడు. పది మెట్లు కిందికి దిగివచ్చి ఆస్తుల పంపటానికి ఒప్పుకున్నాడు. మధ్యవర్తుల ద్వారా తన చెల్లెలికి వర్తమానం పంపాడు. సంప్రదింపులు కూడా జరుపుతున్నాడు. ఈ వ్యవహారం మొత్తం ఇప్పటికే ఒక దారిలోకి వచ్చింది” ఇలా సాగింది రాధాకృష్ణ కథనం.

కష్టకాలమే

రాధాకృష్ణ చెప్పినట్టు ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందికర వాతావరణం నడుస్తోంది. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు.. ఏ రాజకీయ పార్టీ కైనా అవసరం ఆధారంగా రాజీలు ఉంటాయి. రాయబేరాలు కూడా ఉంటాయి. కానీ జగన్ మోహన్ రెడ్డి ఈ లంకెలో కుదురుతారా? అనే ప్రశ్న చాలా మందిలోనూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి నేరుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడే చనువు వుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అధికారం లేకపోయినప్పటికీ ఏదైనా చేయగల సాధనా సంపత్తి ఉంది. అక్కడిదాకా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సౌత్ లో మంచి లాబీయిస్ట్ గా ఉన్న డీకే శివకుమార్ తో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల మాత్రమే తనను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని జగన్ ఎలా నమ్ముతాడు? ఆంధ్రజ్యోతి రాసిన ఈ వాక్యం కాస్త సందేహస్పదంగానే ఉంది. అయితే జగన్ ఒకవేళ కాంగ్రెస్ శిబిరంలో చేరాలి అనుకుంటే.. దానికి షర్మిల అడ్డుగా ఉంటుంది.. అలాగని ఆమె మాట శిలా శాసనం కాదు. పైగా షర్మిలను చూసి జగన్ వణికి పోయే రకం కూడా కాదు. అయితే జ్యోతి రాసినట్టు ఒకవేళ నిజంగానే జగన్ కిందకు దిగి వచ్చాడు అని అనుకుంటే తర్వాత అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.

విలీనం చేస్తాడా?

ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జగన్ చేరిపోతే యూపీఏలోకి ఎంట్రీ ఇస్తాడా.. పార్టీని విలీనం చేయాలని కోరితే అలానే తీసేస్తాడా.. అది నెవర్.. ఎందుకంటే జగన్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయలేడు. తన తండ్రి చనిపోయినప్పుడు సోనియా ఎలా వ్యవహరించారు.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానాలకు పాల్పడింది.. తను జైలుకు ఎందుకు వెళ్ళాడు.. ఇప్పటికీ కేసులను ఎందుకు ఎదుర్కొంటున్నాడు? అనే విషయాలను జగన్ అంత ఈజీగా మర్చిపోడు. ఇప్పటికీ కాంగ్రెస్ లో ప్రజారాజ్యం కలిసిన తీరు జగన్మోహన్ రెడ్డికి ఒక పాఠం లాగా కనిపిస్తూనే ఉంది. ఒకవేళ జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తే ఏపీ జనం పెద్దగా యాక్సెప్ట్ చేయరు.. అంతేకాదు అతడికి పెద్దగా గుర్తింపు ఇవ్వరు. ఈ లెక్కన చూసుకుంటే జగన్ యూపీఏలోకి ఎంట్రీ ఇవ్వడం.. అవసరం మాత్రమే. అది లాంగ్ టర్మ్ రిలేషన్ లాగా కొనసాగదు.. స్థూలంగా చెప్పాలంటే ఒక నటన మాత్రమే.

చూడాలి ఏం జరుగుతుందో..

ఇక షర్మిల కూడా ఆ మధ్య తెలంగాణలో పార్టీ పెట్టింది. దానిని కాంగ్రెస్ పార్టీలో కలిపింది. ఇప్పుడు ఆస్తుల పంపకం కూడా ఒకదారికి వస్తున్న నేపథ్యంలో.. రాజకీయాలకు విరమణ పాటిస్తుందా? అన్నయ్యతో సంధి కుదుర్చుకొని మళ్లీ బాణం అవుతుందా? తల్లితో కలిసి దేవుడి సేవలో పరితపిస్తుందా? బాబాయ్ హత్య కేసు నుంచి పక్కకు తప్పుకుంటుందా? ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ అన్ని కుదిరితే రాధాకృష్ణ నే తన ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తాడు. ఎందుకంటే షర్మిల కు ఇప్పుడు అతడు అత్యంత దగ్గర. పైగా “అన్నా” అని సంబోధిస్తూ షర్మిల ఏవైనా చెప్పుకునే సాన్నిహిత్యం రాధాకృష్ణతో ఉంది. చూడాలి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular