Electricity Charge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉండడం, టీపీసీసీ చీఫ్‌గా తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి అనేక హామీలతోపాటు, ఆరు గ్యాంరటీ హామీలు ఇచ్చాడు. దీంతో ఓటర్లు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. పదినెలల కాలంలో కొన్ని హామీలు అమలు చేశారు. ముఖ్యంగా రూ.2 లక్షల రుణమాఫీ అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. అయితే సబ్సిడీల భారం పెరగడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ప్రధానంగా విద్యుత్ సంస్థలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సెప్టెంబర్‌లో ఈమేరకు ప్రతిపాదనలు చేసింది. దీనిపై సోమవారం(అక్టోబర్ 21 ) నుంచి ఐదు రోజులు విచారణ చేపట్టనుంది విద్యుత్ నియంత్రణ మండలి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లమేర విద్యుత్‌చార్జీలు పెంచాలని విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ప్రతిపాదించింది.
ప్రతిపాదనలు ఇలా..
టీజీఎస్‌పీడీసీఎల్, టీజీ ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ చార్జీలు పెంచాలని కోరుతున్నాయి. హెచ్‌టీ కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు, ఎల్‌టీ కేటగిఈలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి íఫిక్స్‌డ్ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. ఈమేరకు విద్యుత్ నియంత్రణ మండలి విచారణ ప్రారంభించింది. నష్టాలు పూడ్చుకోవడంతోపాటు బకాయిల భారం తగ్గించుకునేందకు ఈఆర్సీకి ప్రతిపాదనలు చేశాయి. అయితే విచారణ అనంతరం చార్జీల పెంపునకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్ బకాయిలు నెలనెలా చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి చార్జీల పెంపు అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
లోటు పూడ్చుకునేందుకు..
తెలంగాణలో ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య లోటు 14,222 కోట్లుగా అంచనా వేశాయి. ఈ మొత్తంలో 13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సమకూర్చాలని కోరాయి. మిగిలిన 1,200 కోట్లు చార్జీల పెంపుద్వారా సమకూర్చుకునే అవకాశం క ల్పించాలని కోరాయి. ప్రస్తుతం 300 యూనిట్లు దాటితే కిలో వాట్‌కు స్థిర చార్జీ రూ.10 వసూలు చేస్తుండగా దానిని రూ.40 పెంచాలని విద్యుత్ సంస్థలు కోరుతున్నాయి. అంటే 200 యూనిట్లలోపు వారికి ఎలాంటి భారం పడదు. ఇక రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్లకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 300 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే కనెక్షన్లు 80 శాతం ఉన్నాయి. దీనితో చార్జీల పెంపు భారం ప్రజలపై పడదని డిస్కంలు చెబుతున్నాయి.
ఒకే కేటగిరీ కిందకు పరిశ్రమలు..
ఇక ప్రస్తుతం హెచటీ పరిశ్రమల జనరల్ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 11 కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకున్న పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.65 వసూలు చేస్తున్నారు. 33 కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకుంటే యూనిట్‌కు రూ.7.15 వసూలు చేస్తున్నారు. 132కేవీ అయితే రూ.6.65 వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని కేటగిరీలను ఒకే కేటగిరీగా ప్రతిపాదించి రూ.7.65 వసూలు చేయాలని డిస్కంలు కోరుతున్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Tgspdcl and tg npdcl are asking the government to increase the electricity charges in telangana from november
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com