Veligonda Project: కరువు నేలలో సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారు సీఎం చంద్రబాబు. కృష్ణమ్మ జలాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. 1996లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత ప్రారంభోత్సవం చేశారు. జాతికి అంకితం చేసిన తర్వాత కృష్ణమ్మ పరవళ్లను చూసి మురిసిపోయారు. తీవ్ర భావోద్వేగానికి లోనై సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రస్తుతం వాటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* సరిగ్గా మూడు దశాబ్దాల కిందట..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1996 మార్చి ఐదున చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆయన చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం కావడం విశేషం. దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ దగ్గర సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జల హారతి ఇచ్చారు. సారే సమర్పించారు. ఈ సందర్భంగా అత్యంత భావోద్వేగానికి లోనైన ఆయన.. కృష్ణా జలాల రాకపై కృతజ్ఞతగా నేలపై సాష్టాంగ ప్రణామం చేశారు. ఆ తరువాత కృష్ణా జలాలను తన తలపై చల్లుకొని ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు.
* ఆనందంతో ప్రజలు..
30 సంవత్సరాల నిరీక్షణ ఫలించడంతో.. పశ్చిమ ప్రకాశం ప్రాంతీయులు పులకించుకుపోయారు. తమ ప్రాంతానికి కృష్ణా జలాలు తరలి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. సొరంగం గుంతలను దాటుకుంటూ ఉబికి వచ్చిన కృష్ణమ్మను చూసి ఆనందంతో పరవశించి పోయారు. ఈ వెలిగొండ మొదటి దశ ప్రారంభం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్ కడప జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు చెందిన 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, నాలుగు లక్షల మందికి తాగునీరు అందనుంది. అయితే సీఎం గా చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టు.. మూడు దశాబ్దాల కిందట ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం అనేది ఈ ప్రాంతీయులు ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. అన్నింటికీ మించి రికార్డు స్థాయిలో నిర్వాసితులకు నష్టపరిహారం అందజేసి చిత్తశుద్ధి చాటుకున్నారు. ఏకకాలంలో నిర్వాసితులతో పాటు రైతుల కళ్ళల్లో ఆనందం నింపారు.
View this post on Instagram