Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి రెండు నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం రానురాను ఉద్రిక్త వ్యవహారంగా మారుతోంది అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి రెండు నెలలకు ఒకసారి
ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల పనితీరును సమీక్షించడానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనుల వేగిరం.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న జాప్యం.. ప్రభుత్వ పథకాల అమలు.. ప్రజల సమస్యలు.. ఇతర విషయాల గురించి తెలుసుకోవడానికి చంద్రబాబు కలెక్టర్లతో ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తుంటారు. సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కలెక్టర్లు ఆయా నివేదికలను తీసుకెళ్తుంటారు. వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేస్తూ ఉంటారు
ముఖ్యమంత్రి అసంతృప్తి
శుక్రవారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ దస్త్రాల క్లియరెన్స్ లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే వివిధ పనులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతున్న తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ అధికారులు.. మంత్రులపై సైతం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులు.. ఇతర అధికారులు వాట్స్అప్ సందేశాలకు వేగంగా స్పందిస్తున్నప్పటికీ.. దస్త్రాలను ప్రాసెస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని.. ఇలా ఎందుకు జరుగుతుందని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దస్త్రాల క్లియరెన్స్ లో జరుగుతున్న జాప్యం మీద ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితి బాగోలేదు
ఇటీవల వివిధ సమస్యల మీద ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల పరిధిలో పరిస్థితి ఇలానే ఉంది. అధికారుల సక్రమంగా పని చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు కూడా ఈ సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. దీంతో ముఖ్యమంత్రి నేరుగా కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి బాగోలేదని అర్థమవుతోంది. ఇప్పటికే వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అన్ని విధాలుగా ప్రభుత్వం గొప్పగా పనిచేస్తున్నప్పటికీ ఏదో ఒక వంక చూపించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటప్పుడు కలెక్టర్లు సరిగా పనిచేయకపోతే ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందువల్లే చంద్రబాబు తన దృష్టికి వచ్చిన విషయాలతో పాటు.. వివిధ అంశాలను ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా అధికారులు మారుతారా.. శ్రద్ధగా పని చేస్తారా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా చూస్తారా.. ఒకవేళ అధికారుల పనితీరు మారకపోతే.. స్థానచలనం తప్పదని.. చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దీనిని బట్టి చంద్రబాబు ఎవరి విషయంలో కూడా ఉదారత చూపించబోనని సంకేతాలు ఇచ్చారు.
Chandrababu Naidu: చంద్రబాబే సీరియస్ అయ్యారు అంటే పరిస్థితి బాగాలేనట్టే..
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి రెండు నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం రానురాను ఉద్రిక్త వ్యవహారంగా మారుతోంది అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి రెండు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల పనితీరును సమీక్షించడానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనుల వేగిరం.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న జాప్యం.. ప్రభుత్వ పథకాల అమలు.. ప్రజల సమస్యలు.. ఇతర విషయాల గురించి తెలుసుకోవడానికి చంద్రబాబు […]