Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరిస్తున్న తీరు చిరాకు కలిగిస్తోంది. ఇటీవల ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు వీధి పోరాటాలు చేశారు. దాచుకున్న డబ్బులు ఇవ్వండి అంటూ ప్రభుత్వం మీద పెద్ద పెట్టున విమర్శలు చేశారు. బకాయిల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని ఆరోపణలు చేస్తూ.. వాగ్వాదానికి దిగారు.
ప్రభుత్వం మీద ఉద్యోగ సంఘం నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి గొప్ప రాజు అనే సీనియర్ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు.. వైసిపి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు.. ఏకంగా జగనే ఉత్తమం అనే రేంజ్ లో ప్రకటనలు ఇవ్వడం.. సరికొత్త చర్చకు దారి తీస్తోంది. బొప్పరాజు ఇలా మాట్లాడటం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల నాయకులతో మీటింగ్ పెట్టుకున్నారు. చాలాసేపు మాట్లాడారు. అంతకుముందు తీవ్ర అగ్రహంతో.. బీభత్సమైన ఎలివేషన్లతో రంకెలు వేసిన ఉద్యోగులు ఆ తర్వాత చల్లబడ్డారు. సరికొత్త పాట అందుకోవడం మొదలుపెట్టారు. సాక్షి మీడియా పదేపదే గుచ్చి గుచ్చి అడిగినప్పటికీ.. జై చంద్రబాబు.. చంద్రబాబు పరిపాలన గొప్పగా ఉంది.. మేము అడిగిన వాటన్నింటికీ ఓకే చెప్పారు.. రాష్ట్ర బడ్జెట్ మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంది.. మా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారు.. ఆయన తీరు గొప్పగా ఉందంటూ ఉద్యోగ సంఘాల నాయకులు గొప్పగా చెప్పారు.
వాస్తవానికి ఉద్యోగ సంఘాల నాయకులకు ఒక్కసారిగా జ్ఞానోదయం కావడం వెనుక చంద్రబాబు విధానాలు ఉత్తమం అని తెలియడం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల పిఎఫ్.. సిపిఎఫ్.. డిఏ బకాయిల కోసం అనేక రకాలుగా వినతులు ఇచ్చారు. ఆయనప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. జీతాలు సక్రమంగా వచ్చేది కాదు. పైగా ఉద్యోగులు ఆందోళన చేస్తే ఆంక్షలు పెట్టేవారు. కేసులతో వేధించేవారు. కూటమి ప్రభుత్వం బకాయిల చెల్లింపుకు స్పష్టమైన టైం లైన్ ఇచ్చింది. ఉద్యోగులతో గౌరవప్రదంగా చర్చించింది. సమస్యల పరిష్కారానికి చొరవ చూపింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో వైఎస్ఆర్సిపి పై ప్రేమ.. జగన్ మీద అభిమానం చూపించిన బొప్పరాజు మీద చర్యలు తీసుకోవాలని.. ఆయన రాజకీయ కోణానికి కళ్లెం వేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగ నేతలకు.. ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు చేయడం ద్వారా భారీ ఎత్తున పొలిటికల్ మైలేజ్ పొందాలని బొప్పరాజు వంటి వారు ప్రయత్నించారని.. కానీ ఆ ప్రయత్నాలకు చంద్రబాబు చెక్ పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. బొప్పరాజుకు బ్రేక్ వేయకుంటే.. ప్రభుత్వం ఎంత గొప్పగా చేసినా సరే.. బురద చల్లుతూనే ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.