Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10 Contestants List : బిగ్‌బాస్ 10లోకి 16 మంది.. ఎవరి...

Bigg Boss Telugu 10 Contestants List : బిగ్‌బాస్ 10లోకి 16 మంది.. ఎవరి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇదిగో పూర్తి లిస్ట్!

Bigg Boss Telugu 10 Contestants List బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా మొదలైపోయింది! హోస్ట్ నాగార్జున మరోసారి తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి షోను మరింత గ్రాండ్‌గా మార్చేశారు. అయితే ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం చాలా స్పెషల్! సెలబ్రిటీ కోటా నుంచి 10 మంది.. కామనర్స్ కోటా నుంచి 6 మంది.. మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్! వీళ్లలో సీరియల్ నటులు ఉన్నారు.. సినిమా యాక్టర్లు ఉన్నారు.. జబర్దస్త్ కమెడియన్స్ […]

Bigg Boss Telugu 10 Contestants List బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా మొదలైపోయింది! హోస్ట్ నాగార్జున మరోసారి తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి షోను మరింత గ్రాండ్‌గా మార్చేశారు.
అయితే ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం చాలా స్పెషల్! సెలబ్రిటీ కోటా నుంచి 10 మంది.. కామనర్స్ కోటా నుంచి 6 మంది.. మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్! వీళ్లలో సీరియల్ నటులు ఉన్నారు.. సినిమా యాక్టర్లు ఉన్నారు.. జబర్దస్త్ కమెడియన్స్ ఉన్నారు.. యాంకర్స్ ఉన్నారు.. యూట్యూబర్లు ఉన్నారు.. జానపద గాయని కూడా ఉంది!
మరి ఈ 16 మంది ఎవరు?
వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
ఎవరికి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?
తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి!

ముందుగా బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ చూద్దాం. దేబ్జానీ మోదక్, త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, సుధీర్ రెడ్డి, అమన్, చైత్ర రాయ్, రాంప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి, జబర్దస్త్ నరేశ్, చరణ్, కృష్ణుడు, వర్షిణి, రోహిత్, నిహర్ ముకేశ్.

16వ కంటెస్టెంట్ – నిహర్ ముకేశ్

చివరిగా 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహర్ ముకేశ్.
తెలుగు ప్రేక్షకులకు ఈయన ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లోని రిషి సర్‌గా బాగా పరిచయం.
కన్నడకు చెందిన ముకేశ్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగా సినిమాలు కూడా చేశారు. అయితే సినిమాల కంటే సీరియల్‌తోనే భారీ గుర్తింపు వచ్చింది.
గతంలో బిగ్‌బాస్ ఆఫర్లు వచ్చినా.. అప్పట్లో షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాలేదని నో చెప్పారట. కానీ ఇప్పుడు మాత్రం బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టారు.
తెలుగు తనకు నాలుక మీద కాకుండా గుండెల్లో ఉంటుందని చెప్పిన ముకేశ్.. ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని వచ్చానన్నారు.

15వ – రోహిత్

15వ కంటెస్టెంట్‌గా రోహిత్ ఎంట్రీ ఇచ్చారు.
బిందు మాధవి ఎంపిక చేయగా.. నాగార్జున ఆయనకు ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న ఒకరిపై నీళ్లు పోయాలని చెప్పినా.. రోహిత్ మాత్రం అలా చేయలేనని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

14వ – వర్షిణి

14వ కంటెస్టెంట్‌గా యాంకర్ వర్షిణి హౌస్‌లోకి అడుగుపెట్టారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన వర్షిణి.. చందమామ కథలు సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టారు.
‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్‌తో పాటు పలు టీవీ షోల్లో కనిపించారు.
బిగ్‌బాస్‌లోకి రావడం తనకు కూడా ఆశ్చర్యమేనని చెప్పిన వర్షిణి.. ఇక హౌస్‌లో తన గ్లామర్‌తో పాటు గేమ్‌తో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో చూడాలి.

13వ – కృష్ణుడు

13వ కంటెస్టెంట్‌గా నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చారు.
‘వినాయకుడు’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. హ్యాపీ డేస్, పోకిరి, ఆర్య 2, మిస్టర్ పర్‌ఫెక్ట్, మనం, గోపాల గోపాల వంటి సినిమాల్లోనూ నటించారు.
ఆయన జీవితంలో ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కాలికి గాయం కావడంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యారు. దాంతో బరువు పెరిగారు. కానీ అదే రూపం ఆయనకు సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో తనలోని ఎన్నో యాంగిల్స్ చూపిస్తానంటున్నారు.

12వ – చరణ్

12వ కంటెస్టెంట్‌గా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా చరణ్ ఎంపికయ్యారు.
నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన చరణ్.. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించారు. యాంకరింగ్, డ్యాన్స్, వీడియో ఎడిటింగ్‌లోనూ తన ప్రతిభను చూపించారు.
అగ్నిపరీక్ష ద్వారా బిగ్‌బాస్‌లోకి వచ్చిన చరణ్.. తన ఫన్నీ నేచర్‌తో హౌస్‌లో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.

11వ – జబర్దస్త్ నరేశ్

ఇక 11వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ నరేశ్ ఎంట్రీ ఇచ్చారు.
తన పొట్టి శరీరాకృతినే బలంగా మార్చుకుని కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన నరేశ్ ఇప్పటికే 600కు పైగా స్కిట్స్ చేసినట్లు చెబుతున్నారు.
రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు షోలు, ఈవెంట్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న నరేశ్.. కుటుంబ పరిస్థితుల నుంచి కష్టపడి జబర్దస్త్ వరకు ఎదిగారు.
మరి బిగ్‌బాస్‌లోనూ అదే కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తారా? అనేది ఆసక్తికరం.

10వ – సృష్టి

10వ కంటెస్టెంట్‌గా సృష్టి ఎంట్రీ ఇచ్చారు.
జ్యూరీ ఎంపిక ద్వారా ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. నాగార్జున ఆమెకు వైట్ గోల్డ్ మెడల్ అందించారు.

9వ – టెంపర్ వంశీ

9వ కంటెస్టెంట్‌గా ‘టెంపర్’ ఫేమ్ వంశీ వచ్చారు.
టెంపర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. ఆ తర్వాత లోఫర్, కాటమరాయుడు, భరత్ అనే నేను, వకీల్ సాబ్, పుష్ప, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల్లో నటించారు.
చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన వంశీ.. సినిమాల కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు.
సినిమాల్లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపించే వంశీ.. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉంటారా? లేక తనలోని మరో కోణాన్ని చూపిస్తారా? అనేది చూడాలి.

8వ – షాలిని

8వ కంటెస్టెంట్‌గా కామనర్స్ నుంచి షాలిని ఎంపికయ్యారు.
నవదీప్ నేతృత్వంలోని ఎంపిక ప్రక్రియలో చివరకు షాలినిని హౌస్‌లోకి పంపించారు.
తనను ఎంపిక చేశారంటే నిజంగా నమ్మలేకపోయానని షాలిని చెప్పడం విశేషం.

7వ – రాంప్రసాద్

7వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ రాంప్రసాద్ వచ్చారు.
జబర్దస్త్‌లో తన ఆటో పంచులు, ప్రాసలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాంప్రసాద్.. తొలుత నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించారు.
అవకాశాలు రాక సొంతూరికి వెళ్లి మెడికల్ హోల్‌సేల్ బిజినెస్ కూడా చేశారు.
జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత రైటర్‌గా తిరిగి హైదరాబాద్ వచ్చి.. ఆ తర్వాత నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడు బిగ్‌బాస్‌లో తన పంచులతో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.

6వ – చైత్ర రాయ్

6వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చారు.
‘అష్టాచమ్మా’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చైత్ర.. ఆ తర్వాత రాధా కళ్యాణం, ఒక్క క్షణం, తథాస్తు వంటి సీరియల్స్‌లో నటించారు.
‘అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు’లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు.
చిన్న బిడ్డను వదిలి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చానని చెప్పిన చైత్ర.. తన ఆటతో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

5వ – అమన్

5వ కంటెస్టెంట్‌గా కామనర్స్ నుంచి అమన్ ఎంపికయ్యారు.
ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్‌లోకి వచ్చిన అమన్‌కు నాగార్జున ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.
రెడ్ బాక్స్‌లోని రెడ్ డాట్‌ను హౌస్‌లోకి వచ్చే ముగ్గురిలో కనీసం ఒకరికి తెలియకుండా పెట్టాలని టాస్క్ ఇచ్చారు.
మరి అమన్ ఈ సీక్రెట్ టాస్క్‌ను ఎలా పూర్తి చేశాడో.. బిగ్‌బాస్‌లో అతని గేమ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

4వ – సుధీర్ రెడ్డి

4వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ సుధీర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సుధీర్.. ‘సుధీర్ టాక్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు.
బిజినెస్‌మెన్‌లు, డాక్టర్లు, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసే వ్యక్తే.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా మారారు.

3వ – సింగర్ ఝాన్సీ

3వ కంటెస్టెంట్‌గా సింగర్ ఝాన్సీ ఎంట్రీ ఇచ్చారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు.
మూడో తరగతి నుంచే పాటలు పాడుతున్న ఆమె.. జానపద గీతాలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ రాణించిన ఝాన్సీ.. అగ్నిపరీక్షలో తన గేమ్‌తో గెలిచి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చారు.
మరి సెలబ్రిటీలతో పోటీ పడుతూ టైటిల్ రేసులో ఎంతవరకు ముందుకు వెళ్తారో చూడాలి.

2వ – త్రిగుణ్

2వ కంటెస్టెంట్‌గా నటుడు త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు సినిమాల్లో అదిత్ అరుణ్‌గా పరిచయమైన ఆయన.. ‘కథ’ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించారు.
వీకెండ్ లవ్, తుంగభద్ర, గరుడవేగ, 24 కిసెస్, డియర్ మేఘా, కొండా, ప్రేమదేశం, డెవిల్ తదితర సినిమాల్లో నటించారు.
ఇక బిగ్‌బాస్‌లోకి వచ్చిన వెంటనే నాగార్జున ఆయనకు ఓ టాస్క్ ఇచ్చారు.
వచ్చే వారానికి హౌస్‌లో కనీసం ముగ్గురిని దెయ్యం ఉందని నమ్మించాలట!
మరి ఈ టాస్క్‌లో త్రిగుణ్ సక్సెస్ అవుతారా? అనేది ఆసక్తికరం.

1వ – దేబ్జానీ మోదక్

ఇక బిగ్‌బాస్ 10లోకి మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది దేబ్జానీ మోదక్.
కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ.. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
తెలుగు భాష పూర్తిగా రాకపోయినా తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మొదటి కంటెస్టెంట్‌గా రావడం సంతోషంగా ఉందని చెప్పిన దేబ్జానీకి.. హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ ప్రవర్తనను బట్టి వారికి పేర్లు పెట్టే టాస్క్ ఇచ్చారు నాగార్జున.

ఇక బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్ విషయానికి వస్తే.. నాగార్జున తనదైన స్టైల్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.
‘ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్’ అంటూ సీజన్‌పై ఆసక్తిని పెంచారు.
ఇతర భాషల బిగ్‌బాస్ హోస్టులు కూడా నాగార్జునతో వర్చువల్‌గా భేటీ కావడం లాంచ్ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే తమిళ నటులు సూర్య, కార్తీ తదితరులు కూడా షోలో సందడి చేశారు.
ఈసారి ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 10ను మరింత సరికొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి.. 16 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొదలైపోయింది.సీరియల్ స్టార్స్ నుంచి సినిమా నటుల వరకు.. జబర్దస్త్ కమెడియన్స్ నుంచి యూట్యూబర్స్ వరకు.. కామనర్స్ నుంచి జానపద గాయని వరకు.. ఈసారి కంటెస్టెంట్స్‌లో మంచి వైవిధ్యం కనిపిస్తోంది.

మరి వీళ్లలో మీ ఫేవరెట్ ఎవరు?
నిహర్ ముకేశ్, త్రిగుణ్, ఝాన్సీ, సుధీర్ రెడ్డి, నరేశ్, రాంప్రసాద్, వర్షిణి.. లేదా మరెవరైనా?
మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు కింద కామెంట్ చేయండి.
మరో ఇంట్రెస్టింగ్ బిగ్‌బాస్ అప్‌డేట్‌తో మళ్లీ కలుద్దాం. అప్పటివరకు.. బై!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper