Homeఆంధ్రప్రదేశ్‌Nadendla Manohar: చంద్రబాబు సీఎం అయ్యాడంటే పవన్ కళ్యాణ్ వల్లనే.. బాంబు పేల్చిన నాదెండ్ల*

Nadendla Manohar: చంద్రబాబు సీఎం అయ్యాడంటే పవన్ కళ్యాణ్ వల్లనే.. బాంబు పేల్చిన నాదెండ్ల*

జనసేనలో నాదెండ్ల మనోహర్ ది ( nadendla Manohar) కీలక పాత్ర. పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరంటే మనోహర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పార్టీలో నెంబర్ 2 పాత్ర పోషిస్తున్నారు.

Nadendla Manohar: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం నడుస్తోంది. టిడిపి కూటమిగా ముందుకు సాగుతోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని.. మూడు పార్టీలు కలిసి సాగుతాయని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తమ మధ్య విభేదాలు కూడా రావని చెప్పుకొచ్చారు. అటువంటి ఆశలు పెట్టుకోవద్దని కూడా సూచించారు. అంతటితో ఆగకుండా పదేళ్లపాటు ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూడా తేల్చేశారు. అయితే దీనిపై జనసైనికులు మండిపడ్డారు కూడా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయ్యేందుకు ఇంతలా కష్టపడాలా అని సలహా ఇచ్చేవారు కూడా ఉన్నారు.

* పార్టీ శ్రేణుల్లో అదే వాదన..
అయితే జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) వల్లే చంద్రబాబు సీఎం అయ్యారన్నది ఎక్కువ వాదన. కింది స్థాయిలో మాత్రం ఇదే ఎక్కువగా వినిపిస్తోంది. బహుశా దీనిని నియంత్రించేందుకే పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను తగ్గిస్తున్నారు. వారిని నియంత్రించే ప్రకటనలు చేస్తున్నారు. అయితే తాజాగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద బాంబు పేల్చారు. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రెక్కల కష్టంతోనే కూటమి గెలిచిందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

* పార్టీలో నెంబర్ 2
జనసేనలో నాదెండ్ల మనోహర్ ది ( nadendla Manohar) కీలక పాత్ర. పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరంటే మనోహర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పార్టీలో నెంబర్ 2 పాత్ర పోషిస్తున్నారు. అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వెనుక నాదేండ్ల మనోహర్ ఎక్కువగా వర్క్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు సైతం నాదెండ్ల మనోహర్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నాదేండ్ల మనోహర్ జనసేన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా జనసేన లేకుంటే టీడీపీ గెలిచేది కాదని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు కాలేకపోయేవారని అన్నారు.

* సహచరుడి హాట్ కామెంట్స్
అయితే జన సైనికులను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కూటమి పార్టీల( Alliance parties) మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల శ్రేణులపై ఉందని హితబోధ చేశారు పవన్. కానీ ఇప్పుడు క్యాబినెట్ సహచరుడు, పార్టీలో కీరోల్ ప్లే చేస్తున్న నాదెండ్ల మనోహర్ జనసేన లేనిదే టిడిపి కూటమి ప్రభుత్వం లేదని చెప్పడం మాత్రం కాస్త వైరల్ అంశంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper