Champions Trophy 2025: ట్రోఫీని నిర్వాహకుల చేతి నుంచి తీసుకున్న తర్వాత.. టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటికి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇంకా పెళ్లి కాలేదు. ట్రోఫీ దక్కించుకున్న ఆనందంలో విరాట్ రెచ్చిపోయాడు. ఓపెన్ గంగ్ నమ్ స్టార్ పాటకు బీభత్సమైన స్టెప్పులు వేశాడు. వైట్ జెర్సీ ధరించి.. టీమిండియా మిగతా ఆటగాళ్లు వేదిక మీద ఉండగా.. వేదిక కింద ఉన్న అతడు రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. ఓపెన్ గంగ్ నమ్ స్టార్ పాటకు ఊగిపోయాడు. ఆ తర్వాత మైదానం మీద పడుకొని పుష్ అప్స్ తీశాడు.
ఇప్పుడు కూడా..
ఇక ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగో వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ క్రమంలో ట్రోఫీ అందుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ చిందులు వేశారు. వైట్ జెర్సీ ధరించి..ఇద్దరూ తమకు నచ్చిన తీరుగా స్టెప్పులు వేశారు. 2013.. 2025 లో చాంపియన్స్ ట్రోఫీలు దక్కించుకున్నప్పుడు టీమిండియా ఆటగాళ్ల ఉత్సాహాన్ని పోల్చి చూస్తూ అభిమానులు వీడియో రూపొందించారు.. ఆ వీడియోలో 2013లో విరాట్ కోహ్లీ గంగ్ నం స్టార్ పాటకు స్టెప్పులు వేగా.. 2025లో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ డాన్సులు వేశారు. వారిద్దరు డ్యాన్స్ చేస్తుంటే మిగతా టీం మేట్లు మొత్తం ఉత్సాహపరిచారు. ఈ వీడియోను చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్లకు డ్యాన్స్ మాస్టర్లుగా అవకాశాలు ఇస్తే ప్రభుదేవా, గణేష్ ఆచార్య మాస్టర్లను మించిపోతారని వ్యాఖ్యానిస్తున్నారు. ” బ్యాటింగ్ మాత్రమే కాదు, స్టెప్పులతోను టీమిండియా ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్లను మించిపోయారు. వారు వేసిన స్టెప్పులు చూస్తే నిజంగానే మతిపోయిందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
సాధారణంగా విరాట్ మైదానంలో చలాకీగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. శ్రేయస్ అయ్యర్ కూడా చిలిపి పనులు చేస్తుంటాడు. వీరిద్దరూ ఉంటే జట్టులో నవ్వులు వెల్లివిరుస్తాయి. అందువల్లే వీళ్లంటే మిగతా ఆటగాళ్లు ఇష్టాన్ని చూపిస్తుంటారు. అందుకే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్న తర్వాత వీరిద్దరూ డాన్సులు వేశారు. మిగతా ఆటగాళ్లను కూడా స్టెప్పులు వేయమని సూచించారు. కాకపోతే వారు వేదికపై ఉండి ఈలలు వేస్తూ గోలలు చేశారు. మొత్తానికి 2017 నాటి ఓటమికి టీమిండియా ఆటగాళ్లు ఇలా బదులు తీర్చుకున్నారు. న్యూజిలాండ్ పై సాధించిన విజయాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
View this post on Instagram