Irumbudi First Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ సైతం తనదైన రీతిలో రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు అతనికి పెద్దగా సక్సెస్ అయితే సాధించి పెట్టడం లేదు. దాంతో శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ మూవీ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈనెల 21వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రతంగా వైరలవుతున్నాయి. ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సినిమా పెద్దల కోసం ప్రివ్యూ షో వేశారట.
ప్రివ్యూ ని చూసిన ప్రతి ఒక్కరు సినిమా మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి సినిమా చాలా అద్భుతంగా ఉందని రవితేజ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించారంటూ ఈ మూవీ ని చూసిన ఇండస్ట్రీ పెద్దలు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రవితేజ నుంచి ఇలాంటి సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరని కూడా వాళ్ళు చెబుతుండడం విశేషం…
నిజానికి ఈ సినిమాలో కూతురి సెటిమెంట్ తో పాటు అయ్యప్ప స్వామికి సంబంధించిన ఒక డీటెలింగ్ ను కూడా ఈ సినిమాలో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే మాత్రం రవితేజ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తాడు. దర్శకుడు శివ నిర్వాణ సైతం ఈ సినిమాని చాలా ఎఫెక్ట్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది.
గతంలో ఆయన చేసిన సినిమాలు ఒకటి రెండు సక్సెస్ లు సాధించిన కూడా వరుస డిజాస్టర్లను మూటగట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా కీలకం… అందుకే దీని మీద స్పెషల్ కేర్ తీసుకొని మరి మూవీని చేసినట్టుగా తెలుస్తోంది…ఈ మూవీ ఎలా ఉండబోతుంది ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందనేది తెలియాలంటే మాత్రం ఈనెల 21వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…