Festival Season Jobs : శ్రావణమాసం ప్రారంభంతో పండుగ సీజన్ మొదలైనట్లే. దీంతో దైవ క్షేత్రాల్లో పూజలు జ్వరం అందుకున్నాయి. అలాగే ఇళ్లల్లోనూ ప్రత్యేక వ్రతాలు చేయడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దాదాపు సంక్రాంతి వరకు వరుసగా పండుగలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని వ్యాపారాలు కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. పూజలతో పాటు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉన్నందున వాటికి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా గిగ్ వర్కర్లకు కూడా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని డెలివరీ సంస్థలు ప్రత్యేకంగా నియామకాలు చేపడుతుంది. ఈ వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా పండుగల సీజన్ సందర్భంగా 2.7 తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మానవ వనరుల సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ కామర్స్, క్విక్ కామర్స్, లాజిస్టిక్స్ వంటి వాటిలో ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వినియోగదారులకు ఎక్కువగా అవసరాలు ఉంటాయి. ఇదే సమయంలో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఆన్లైన్ ద్వారానే ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లో ఎక్కువగా ఆఫర్స్ రావడంతో ఈ రంగం షాపింగ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే దేశంలో భువనేశ్వర్, జైపూర్, కోయంబత్తూర్ వంటి నగరాల్లో డెలివరీ, లాజిస్టిక్స్ వంటి కార్యకలాపాలు ఎక్కువగా సాగర్ ఉన్నాయి. ఈ సమయంలో గిగ్ వర్కల్లా అవసరం పెరిగే అవకాశం ఉందని సంస్థలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా మెట్రో నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ టు నగరాల్లో కూడా ఈ సీజన్లో ఎక్కువ నియామకాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉండడంతో పాటు ఈ రంగంలో వారి సంఖ్య తక్కువగా ఉన్నందున ఇప్పటికే అనుభవం ఉన్నవారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారి జీతాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే తాత్కాలికంగా ఉద్యోగులుగా నియామకం అయ్యే వారికి సైతం 12 నుంచి 15% వరకు అదనపు జీతంతో జాయిన్ కావచ్చు అని అంటున్నారు. వీటికి తోడు ఓవర్ టైం, ఇన్సెంటివ్ వంటి మార్గాల ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. అయితే వీరు మాత్రమే కాకుండా ఇప్పటివరకు తాత్కాలికంగా ఉన్నవారు పర్మినెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుపుతున్నారు.
కొత్తగా నియామకం అయ్యే వారికి కొన్ని అర్హతలు నిర్ణయించే అవకాశం ఉంది. వీరికి డిజిటల్ పరిజ్ఞానం ఉండడంతో పాటు స్మార్ట్ఫోన్ వినియోగం, కస్టమర్లతో మాట్లాడే నైపుణ్యం, స్థానిక బాషపై పట్టు, సమయపాలన వంటివి ఉన్నవారికి అవకాశాలు ఇస్తారు. అంతేకాకుండా సొంతంగా టూ వీలర్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కూడా ఉంటే వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి.