Homeజాతీయ వార్తలుKerala YouTuber: ప్రముఖ యూట్యూబర్ ను వదిలి కండక్టర్ తో ఎందుకు వెళ్లిపోయిందో బయటపడింది

Kerala YouTuber: ప్రముఖ యూట్యూబర్ ను వదిలి కండక్టర్ తో ఎందుకు వెళ్లిపోయిందో బయటపడింది

Kerala YouTuber: అతను ఒక ప్రముఖ యూట్యూబర్. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. పైగా అతడు తన భార్యతో కలిసి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనగా మారాయి. అతడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల వివాహం జరిగి కూడా రెండు సంవత్సరాలు దాటింది. వైవాహిక జీవితం మెరుగ్గానే సాగుతోంది. కానీ ఇంతలోనే అతడికి షాక్ తగిలింది. ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్య ఉన్నట్టుండి వెళ్లిపోయింది. ఆ ప్రముఖ యూట్యూబర్ పేరు అఖిల్. ఇతడు కేరళ […]

Kerala YouTuber: అతను ఒక ప్రముఖ యూట్యూబర్. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. పైగా అతడు తన భార్యతో కలిసి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనగా మారాయి. అతడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల వివాహం జరిగి కూడా రెండు సంవత్సరాలు దాటింది. వైవాహిక జీవితం మెరుగ్గానే సాగుతోంది. కానీ ఇంతలోనే అతడికి షాక్ తగిలింది. ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్య ఉన్నట్టుండి వెళ్లిపోయింది.

ఆ ప్రముఖ యూట్యూబర్ పేరు అఖిల్. ఇతడు కేరళ రాష్ట్రంలో పేరుపొందిన యూట్యూబర్. ఎన్నో వీడియోలు తీశాడు. ఇతడికి కేరళ రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది.. పైగా తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లికి ఇరువైపులా కుటుంబాలను ఒప్పించి ఆ వేడుకను ఘనంగా చేసుకున్నాడు. భార్యతో కలిసి వీడియోలు కూడా చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రకంపనలను సృష్టించాయి. ఇలా అతని జీవితంలో ప్రతి మెట్టు సాఫీగా సాగుతున్న నేపథ్యంలో.. ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఫలితంగా అతని జీవితం కల్లోలం గా మారింది.

అఖిల్ భార్య ఇటీవల ఒక బస్సు కండక్టర్ తో పారిపోయింది. ఎందుకిలా చేసిందో మొదట్లో అర్థం కాలేదు.. ఆ తర్వాత అందరూ ఆమెను దూషించడం మొదలుపెట్టారు. చివరికి ఇటీవల అఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె దారి ఆమె చూసుకుంది. ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అఖిల్ చెప్పాడు.

ఇటీవల కాలంలో అఖిల్ ఆమె మీద దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెను చీటికిమాటికి వేధించేవాడు. ఇది తట్టుకోలేక ఆమె కండక్టర్ తో చనువు పెంచుకుంది. అతడు చూపించే ప్రేమ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లింది. అందువల్లే అతనితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. చివరికి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి. చివరికి ఆమె ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయిందో తేలింది. దీంతో ఇప్పుడు కేరళలో ఆ యూట్యూబర్ గురించి నెగిటివ్ చర్చ మొదలైంది.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ముఖ్యంగా ఈగోలను వదిలిపెట్టాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఎన్ని గొడవలు అయినా సరే బాధ్యతాయుతంగా ఉండాలి. అప్పుడే ఆ సంసారం బాగుంటుంది. లేకపోతే ఇలా కొద్దిరోజులకే చీలిపోతుంది. యూట్యూబర్ వ్యవహారం ఎంతమందికి ఒక పాఠం లాంటిది. అందువల్లే కొత్తగా పెళ్లయిన వారు.. గతంలో వివాహమైన వారు ఈ ఉదంతాన్ని ఒక పాఠం లాగా తీసుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper