Homeఆంధ్రప్రదేశ్‌Jamily Elections : జమిలీ సరే..వైసీపీ ఎన్నికలను ఎదుర్కోగలదా?

Jamily Elections : జమిలీ సరే..వైసీపీ ఎన్నికలను ఎదుర్కోగలదా?

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి ప్రజలు తిరస్కరించారు. ఐదేళ్ల పాలనను చూసి ఓడించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇంతలో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు. అదే జరిగితే తమకు తిరిగి ప్రజలు అవకాశం ఇస్తారని వైసీపీ నేతలు కలలు కంటున్నారు.

Jamily Elections : వైసిపి జమిలీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుందా? రాష్ట్రంలో ముందస్తుగా ఎన్నికలు వస్తాయని భావిస్తోందా? మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏమో జమిలీతో ముందస్తు ఎన్నికలు రావొచ్చేమో? ఈ కష్టాలు ఉండవేమో? అంటూ జగన్ముందుగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.తాజాగా మాజీ మంత్రి కాకానిగోవర్ధన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండేది రెండేళ్లు మాత్రమేనని తేల్చేశారు.వచ్చేది వైసిపి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు.అయితే ఇది వినడానికి హాయిగా ఉంది?సాధ్యమేనా?అన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రంలో బిజెపి భాగస్వామ్యంతో ఉన్న కూటమి ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో చంద్రబాబు కీలక భాగస్వామి. తప్పకుండా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసంగట్టిగానే పోరాడుతారు. ఇప్పటికే చంద్రబాబు జమిలి ఎన్నికలకు జై కొట్టారు. అంటే ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది కదా? కేంద్రం వద్ద ఆ స్థాయిలో హామీ లేకుండా ఆయన మాట్లాడతారా? రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే ముందస్తు ఎన్నికలకు అంగీకరించరు కదా? ఇలా ఎన్నెన్నో చిక్కుముడులు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

* ఎన్నెన్నో అభ్యంతరాలు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది.. జమిలి లక్ష్యం. దీనికి ఇండియా కూటమి నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనేదిమంచిది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తోంది.దేశవ్యాప్తంగా ఈవీఎంలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో జమిలీ అంటే రాజకీయ పార్టీలు అంగీకరించే పరిస్థితి లేదు. కానీ కేంద్రం మాత్రం మొండి పట్టుదలతో ఉంది. పార్లమెంట్ ఆమోదానికి ప్రయత్నిస్తోంది. అయితే భాగస్వామ్య పార్టీగా టిడిపి దీనిని ఆహ్వానించింది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామంటే ఆ పార్టీ ఒప్పుకునే ఛాన్స్ లేదు.

* మళ్లీ ఆ నిర్ణయం తీసుకుంటారా?
జమిలి లో భాగంగా ముందస్తు ఎన్నికలు వస్తే తట్టుకునే స్థితిలో వైసిపి ఉందా? ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని దారుణంగా తిరస్కరించారు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. గత ఐదేళ్ల వైసిపి పాలనను విసిగి చెందిన ప్రజలు ఈ నిర్ణయానికి వచ్చారు. మళ్లీ జగన్ అధికారం ఇవ్వాలని కోరితే ప్రజలు ముందుకు వస్తారా? పోనీ వైసీపీ ఏమైనా ప్రజా పోరాటాలు చేసిందా? ఆ పార్టీ పటిష్ట స్థితిలో ఉందా? అంటే సమాధానం దొరకదు. పార్టీలో సీనియర్లు సైలెంట్ అయ్యారు. జూనియర్లు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న వారు గుడ్ బై చెబుతున్నారు. ఇన్నిసంక్లిష్ట సమస్యల్లో ఉన్న వైసిపి ముందస్తు ఎన్నికలు వచ్చినా.. ఫేస్ చేసే పరిస్థితుల్లో లేదు. అటువంటిప్పుడు వైసీపీ నేతలు ఎంత హడావిడి చేసినా ఏం లాభం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper