CM Chandrababu : ఏపీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు బుట్ట దాఖలు అవుతున్నాయి.గత అనుభవాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయవద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు విషయంలోఒకటికి రెండుసార్లు హెచ్చరించారు. ప్రముఖుల పర్యటన పేరుతో ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని సూచించారు. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చేయవద్దని ఆదేశాలిచ్చారు.అయితే విజయవాడ నగరంలో సీఎం చంద్రబాబు ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు.మంగళవారంహోంమంత్రి వంగలపూడి అనిత,డీజీపీ ద్వారకా తిరుమలరావువెలగపూడి సచివాలయం నుంచి తిరిగి వెళ్లే గ్రామంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.విజయవాడ నుంచి వెలగపూడి వైపు వెళ్లే వాహనాలు కరకట్ట ప్రారంభంలో నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే విజయవాడ నగరంలో వీఐపీల రాకపోకల పేరిట తరచూ ట్రాఫిక్ ను నిలిపి వేస్తున్నారు. చివరకు డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు వచ్చినప్పుడు సైతం అదే పరిస్థితిని కొనసాగిస్తున్నారు.దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* గెలిచిన వెంటనే కుండ బద్దలు
తన పర్యటనల విషయంలో ట్రాఫిక్ ఆంక్షలు వద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ముందు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.ఏపీలో కూటమి గెలిచిన తరువాతపార్టీ ఎంపీలతో కలిసి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు.ఆ క్రమంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. దీనిపై అప్పట్లోనే చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజలతో ఇష్టానుసారంగా వ్యవహరించకండి. భద్రత విషయంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తే చాలు అని చెప్పుకొచ్చారు. బారికేడ్లు, పరదాలు,రోడ్లు మూసివేత, షాపుల బంద్ లాంటి పోకడలకు ఇక స్వస్తి పలకాలని సూచించారు చంద్రబాబు.కానీ ప్రస్తుతం విజయవాడ నగరంలో చంద్రబాబు ఆదేశాలు అమలు కావడం లేదు.
* పరదాల సంస్కృతికి చెక్
గత ఐదేళ్ల వైసిపి పాలనలో.. సీఎంగా ఉన్న జగన్ ఆకాశమార్గంలో ఎక్కువగా ప్రయాణించేవారు. అయితే ఆయన ఆకాశమార్గంలో ఉండగా కింద ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఏదైనా పర్యటనకు జిల్లాలో అడుగుపెడితే ప్రజలకు చుక్కలు చూపించేవారు. పరదాలు కట్టి.. అడుగడుగునా ఆంక్షలు కొనసాగేవి. ఇక పచ్చని చెట్లు కూడా ధ్వంసం అయ్యేవి. రహదారులను సైతం ధ్వంసం చేసేవారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా నాడు జగన్ సర్కార్ పట్టించుకోలేదు.అందుకే చంద్రబాబు ఈ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.సీఎంగా బాధ్యతలు తీసుకోక మునుపే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.కానీ అవి అమలుకు నోచుకోకపోవడం విశేషం.