HomeNewsNara Bhuvaneshwari: ఏం బాగున్నావా..ఒక్కడివే వచ్చావా..నారా భువనేశ్వరి పలకరింపు..ఉబ్బితబ్బిబైన బండ్ల గణేష్.. వైరల్ వీడియో

Nara Bhuvaneshwari: ఏం బాగున్నావా..ఒక్కడివే వచ్చావా..నారా భువనేశ్వరి పలకరింపు..ఉబ్బితబ్బిబైన బండ్ల గణేష్.. వైరల్ వీడియో

Nara Bhuvaneshwari: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో తల సేమియా కేర్ సెంటర్.. రక్త నిధి కేంద్రాన్ని ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. తల సేమియా రోగుల కోసం ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ విశేషమైన కార్యక్రమాలను చేపడుతోంది. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఏకంగా ప్రత్యేకమైన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. అక్కడ ప్రతిరోజు స్వచ్ఛందంగా దాతల నుంచి రక్తాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. తల సేమియా రోగుల కోసం మందులను.. భక్త మార్పిడిని.. చేపడుతూ ఉంటుంది. […]

Nara Bhuvaneshwari: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో తల సేమియా కేర్ సెంటర్.. రక్త నిధి కేంద్రాన్ని ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. తల సేమియా రోగుల కోసం ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ విశేషమైన కార్యక్రమాలను చేపడుతోంది. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఏకంగా ప్రత్యేకమైన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. అక్కడ ప్రతిరోజు స్వచ్ఛందంగా దాతల నుంచి రక్తాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. తల సేమియా రోగుల కోసం మందులను.. భక్త మార్పిడిని.. చేపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా పూర్తి ఉచితంగా. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ వ్యవహారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ పూర్తి ఉచితంగా చేస్తూ ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తల సేమియా రోగులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. తల సేమియా రోగుల కోసం ఏకంగా కేర్ సెంటర్.. అనుభవజ్ఞులైన వైద్యులను.. రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఈ కార్యక్రమం శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వెల్లడించారు.

నారా భువనేశ్వరి సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె.. నారా చంద్రబాబు నాయుడు భార్య.. నారా లోకేష్ మాతృమూర్తి.. ఇన్ని హోదాలు ఉన్నప్పటికీ ఆమె.. వాటి అన్నింటిని పక్కనపెట్టి కార్యకర్తలతో మమేకమయ్యారు. శుక్రవారం జరిగిన తల సేమియా కేర్ సెంటర్ ప్రారంభోత్సవం తర్వాత. టిడిపి లో కరోడు కట్టిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ తో ఆత్మీయంగా మాట్లాడారు. ఇక్కడ నిలబడ్డారేంటి.. రండి లోపలి.. కూర్చోబెట్టండి అంటూ ఒక తెలిసిన పెద్దాయనను ఆప్యాయంగా చేపట్టుకొని లోపలికి తీసుకెళ్లారు నారా భువనేశ్వరి అంతేకాకుండా ప్రముఖ శని నిర్మాత బండ్ల గణేష్ ను ఆప్యాయంగా పలకరించారు. “ఏం గణేష్ ఎప్పుడు వచ్చావు.. ఒక్కడివే వచ్చావా అంటూ” శని నిర్మాత బండ్ల గణేష్ ను ఆప్యాయంగా పలకరించారు. విజయవాడ లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తల సేమియా కేర్ సెంటర్.. రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో అందరిని ఆప్యాయంగా పలకరించి.. తనలో ఉన్న అమ్మతనాన్ని.. మరోసారి నిరూపించుకున్నారు నారా భువనేశ్వరి.

నారా భువనేశ్వరి ఇప్పుడే కాదు హెరిటేజ్ ఉద్యోగులతో.. హెరిటేజ్ సంస్థకు పాలు పోసే రైతులతో కూడా ఇలానే వ్యవహరిస్తుంటారు. వారితో మమేకమవుతుంటారు. వారికి దగ్గర ఉండి భోజనం వడ్డిస్తారు. వారికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారు. అక్కడితోనే నారా భువనేశ్వరి ఆగిపోరు. చివరికి తల సేమియా రోగులకు అత్యవసరమైన వైద్యం కావాల్సి ఉంటే నేరుగా ఆమె రంగంలోకి దిగుతారు. వైద్యులతో మాట్లాడుతారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా.. ప్రాంతాలతో సంబంధం లేకుండా.. ఆమె ప్రజాసేవనే శిరో ధార్యంగా భావిస్తుంటారు. గతంలో అనేక సందర్భాలలో ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు నారా భువనేశ్వరి ఇలానే వ్యవహరించారు. ఎందుకంటే ఆమెకు ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టం. ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకోవడం మరింత ఇష్టం. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తెగా.. నారా చంద్రబాబు నాయుడు భార్యగా.. నారా లోకేష్ తల్లిగా.. ఇన్ని హోదాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ పక్కనపెట్టి కార్యకర్తలతో.. ప్రజలతో ఆమె మమేకమవుతున్న తీరు.. గొప్పగా ఉంటుంది. ఒక తల్లి ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని నిరూపిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper