Chandrababu Naidu: అతడు సినిమాలో ఒక పాట ఉంటుంది.. అదరక బదులే చెప్పేటి తెగువకి తోడు అతడే.. పెను తుఫాను తల వంచి చూస్తే నిప్పుకణం అతడే.. ఈ పాట చంద్రబాబు నాయుడు నాయకత్వానికి.. ఆయన పని తీరుకు నూటికి మూడు శాతం కాదు.. అంతకుమించి సరిపోతుంది. సాధారణంగా చంద్రబాబు పనిని విపరీతంగా ఇష్టపడుతుంటారు. పనిచేయడాన్ని ఆస్వాదిస్తుంటారు. ఆయనకు పనిలోనే ఆనందం లభిస్తుంది. విపత్తులు వంటివి చోటు చేసుకున్నప్పుడు ఆయన నిద్ర కూడా పోరు. సచివాలయంలోనే ఉంటారు. అధికారులతో నిత్యం మాట్లాడుతుంటారు. సలహాలు, సూచనలు ఇస్తుంటారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు విశాఖ పట్నంలోని మకాం వేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ ను.. తాగునీటిని సరఫరా చేశారు. ప్రజలకు కష్టాలు లేకుండా చూసుకున్నారు. ఇబ్బందులను దాదాపు దూరం చేశారు.
ఇప్పుడు ఏర్పడిన ప్రకృతి విపత్తు సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిపాలనపరంగా తన అనుభవాన్ని ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి ఆయన ఉపయోగించారు. అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేశారు. సమీక్షలు జరుపుతూనే.. సహాయక చర్యలు జరపడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదు. ప్రకృతి విధ్వంసం సృష్టించినప్పటికీ చంద్రబాబు.. ప్రభుత్వపరంగా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. అందులో విజయం కూడా సాధించారు. ఎటువంటి ప్రకృతి విపత్తు అయినా.. ఎలాంటి సవాల్ అయినా సరే చాలెంజ్ గా తీసుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక మార్గాన్ని అనుసరిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రకృతి విపత్తులు ఏపీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ చంద్రబాబు ఏసీ రూములకు పరిమితం కాలేదు. తన మార్క్ క్రైసిస్ మేనేజ్మెంట్ తో.. అధికార యంత్రాంగంతో సమర్ధవంతంగా పని చేయించుకున్నారు.
తుఫాను తీరం దాటుతున్న సమయంలో ఏపీ రాష్ట్రంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా ప్రణాళిక రూపొందించుకుంది. తుఫాన్ రావడానికి ముందే తీర ప్రాంతాలలో.. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అత్యంత సురక్షితమైన పునరావస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఆరోజు రాత్రి మొత్తం చంద్రబాబు కంటిమీద నిద్ర కూడా పోలేదు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. కలెక్టర్లను.. క్షేత్రస్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేశారు.. ఆదేశాలు జారీ చేశారు.
32,000 మందితో ఏకకాలంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం.. ఆయన అనుభవానికి నిలువెత్తు రూపం. ప్రకృతి విపత్తు వల్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వాటన్నింటినీ కేవలం గంటల వ్యవధిలోనే చంద్రబాబు క్లియర్ చేశారు. ఇది చంద్రబాబు పనితీరుకు ఒక ఎగ్జాంపుల్. విపరీతమైన గాలుల వల్ల చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. వాటిని వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. విద్యుత్ సరఫరాను కూడా సరి చేశారు.. ఎన్డిఆర్ఎఫ్.. ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలను ప్రభుత్వం సమన్వయం చేసుకొని పని చేయించుకుంది. బాధితులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించింది. ఆహారం సరఫరా చేసింది. వైద్య సదుపాయాలు అందేలా చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో భరోసా కల్పించారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. త్వరలోనే రైతులకు పరిహారం అందించే కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you.
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab https://t.co/4uMfAMiqn0— N Chandrababu Naidu (@ncbn) October 28, 2026