Homeఆంధ్రప్రదేశ్‌AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో సైతం చిరుజల్లులు పడుతున్నాయి. ఆకాశం మేఘావృత్తమై వర్ష సూచన కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఈరోజు ఉత్తరాంధ్రతో […]

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో సైతం చిరుజల్లులు పడుతున్నాయి. ఆకాశం మేఘావృత్తమై వర్ష సూచన కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఈరోజు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉంది. రుతుపవనాల కదలికతోనే ఈ మార్పు అని తెలుస్తోంది.

* ఈరోజు ఈ జిల్లాల్లో వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలకు ఈరోజు వర్ష సూచన ఉంది. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదు కావచ్చు అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఈ వర్షాలతో రైతులకు కొంత ఊరట దక్కే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతోంది. ఈరోజు ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, అమరావతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. మరోవైపు తిరుపతి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

* రుతుపవనాలు విస్తరణ..
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మారిన పరిస్థితుల కారణంతోనే వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా నైరుతి రుతుపవనాలు మళ్లీ విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా అద్దంకి, శ్రీ సత్య సాయి జిల్లా ఆగలి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది.. వాస్తవానికి జూన్లో కూడా అధిక వర్షపాతం లోటు కనిపించింది. నైరుతి రుతుపవనాల రాక కూడా ఆలస్యం అయింది. జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. జూలైలో సైతం లోటు కనిపిస్తోంది. జూలై చివరి వారం గడుస్తున్నా వర్షాలు జాడలేదు. ఖరీఫ్ లో భాగంగా వరి ఉడుపులు కూడా జరగలేదు. ఇటువంటి తరుణంలో వర్షాలు పడుతుండడం.. వర్షాలు కురుస్తాయని తెలుస్తుండడం ఉపశమనం కలిగించే విషయం. కానీ దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు ఉంది. దానికి ప్రధాన కారణం ఎల్ నినో. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఆందోళనతో ఉన్నారు. ఖరీఫ్ పై ఆశలు వదులుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper