Homeఆంధ్రప్రదేశ్‌Godavari River: 'గోదావరి' గుండె తరుక్కుపోతోంది.. 70 ఏళ్లలో ఇది చూడలే!

Godavari River: ‘గోదావరి’ గుండె తరుక్కుపోతోంది.. 70 ఏళ్లలో ఇది చూడలే!

Godavari River: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం లోటు ఉంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో వాయు గుండాలు, ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఇవేవీ పనిచేయడం లేదు. నైరుతి రుతుపవనాలు మరోసారి విస్తరించినా ఫలితం లేదు. దీంతో చాలా ప్రాంతాల్లో చినుకు రాలడం లేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో లోటు కనిపిస్తోంది. నదులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు బేల చూపులు చూస్తున్నాయి. వేట ఈ సమయానికి ఉగ్రంగా ఉండే […]

Godavari River: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం లోటు ఉంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో వాయు గుండాలు, ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఇవేవీ పనిచేయడం లేదు. నైరుతి రుతుపవనాలు మరోసారి విస్తరించినా ఫలితం లేదు. దీంతో చాలా ప్రాంతాల్లో చినుకు రాలడం లేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో లోటు కనిపిస్తోంది. నదులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు బేల చూపులు చూస్తున్నాయి. వేట ఈ సమయానికి ఉగ్రంగా ఉండే గోదావరి.. పూర్తిగా కాల తప్పింది. లోటు ప్రవాహంతో బోసిపోతుంది. ఇసుక తిన్నెలు కనిపిస్తూ కరువు ఛాయల సంకేతాలు కనిపిస్తున్నాయి. గుండె తరుక్కుపోతోంది గోదావరి ను చూసి..

* ఈ సమయంలోనే ఉగ్రరూపం..
సాధారణంగా జూన్ నుంచి ఉగ్రరూపం చూపిస్తూ ఉంటుంది గోదావరి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడిన.. తుఫానులు సంభవించిన సమయంలో ఉగ్రంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ గత ఏడు దశాబ్దాల్లో లేనివిధంగా ఈ సమయంలో గోదావరి కళ తప్పి కనిపించడం చూసి గోదారి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి విశాఖ జిల్లా వరకు సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చే నది ఈసారి తగిన భరోసా ఇవ్వలేకపోతోంది. డెల్టా పరిధిలోని 10.13 లక్షల ఎకరాలు మినహా.. కీలకమైన ఏలేరు జలాశయం రిజర్వాయర్, పుష్కర, ఇతర ఎత్తిపోతల పథకాలు కింద సుమారు రెండు లక్షల ఎకరాలకు ఎంతవరకు అందించగలదు అనేది ఇప్పుడు అనుమానమే.

* వేల క్యూసెక్కులకు పడిపోయిన ప్రవాహం..
జూలై వచ్చిందంటే చాలు గోదావరి ఉగ్రరూపం చూపించేది. రైలు మార్గంలో గోదావరిని దాటి వెళ్లేవారు నది ఉగ్రరూపాన్ని చూసి భయపడేవారు. ఏటా ఈ సమయానికి నాలుగు లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కుల జలాలతో ఉరకలెత్తేది. అటువంటి నదిలో ప్రస్తుతం వేల క్యూసెక్కుల్లో మాత్రమే జలాలు వస్తున్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకు 101 టీఎంసీలు సమకూరాయి. 57 టీఎంసీలు గోదావరి డెల్టా ఆయకట్టుకు.. 44 టీఎంసీలు సముద్రంలోకి విడిచిపెట్టారు. అయితే ఒకే ఒక్క రోజు భారీగా ఇంట్లో ఉంది. అది కూడా మహారాష్ట్రలో భారీ వర్షాల సమయంలోనే. ప్రస్తుతం గోదావరి నదిని చూస్తే గుండె తరుక్కుపోతోంది. మరి మున్ముందైన వర్షాలు పడి గోదారమ్మకు కళ వస్తుందో లేదో చూడాలి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper