Homeఆంధ్రప్రదేశ్‌AP Government: ఏపీలో ఇన్ ఫ్లూయెన్సర్లకు జాక్ పాట్.. ఫాలోవర్లు, వ్యూస్ ఉంటే సర్కారు డబ్బులు..

AP Government: ఏపీలో ఇన్ ఫ్లూయెన్సర్లకు జాక్ పాట్.. ఫాలోవర్లు, వ్యూస్ ఉంటే సర్కారు డబ్బులు..

AP Government: సోషల్ మీడియాను చాలామంది ఒక టైం పాస్ వ్యవహారం లాగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ భావన పూర్తిగా మార్చుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది టైంపాస్ కోసం చేసే వ్యవహారం కాదు. ఎందుకంటే ఒక సమాచారం క్షణాలలో లక్షల మందికి చేరాలంటే.. ప్రజలలోకి తీసుకెళ్లాలంటే సోషల్ మీడియా ఇప్పుడు ప్రధానమైన వేదిక. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించి సంచలన ప్రకటన చేసింది. […]

AP Government: సోషల్ మీడియాను చాలామంది ఒక టైం పాస్ వ్యవహారం లాగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ భావన పూర్తిగా మార్చుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది టైంపాస్ కోసం చేసే వ్యవహారం కాదు. ఎందుకంటే ఒక సమాచారం క్షణాలలో లక్షల మందికి చేరాలంటే.. ప్రజలలోకి తీసుకెళ్లాలంటే సోషల్ మీడియా ఇప్పుడు ప్రధానమైన వేదిక. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించి సంచలన ప్రకటన చేసింది.

సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి..

ఏపీ లో ప్రభుత్వ పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు.. వంటి వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇన్ ఫ్లూయెన్సర్ ల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోబోతోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్ల ఎం ప్యానెల్మెంట్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ఇకపై సోషల్ మీడియాలో ప్రభుత్వ కార్యక్రమాల పై కంటెంట్ రూపొందించే వారికి అధికారికంగా గుర్తింపు ఇస్తుంది. వారికి లభించే రీచ్ ఆధారంగా నగదు ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది.. ఈ పాలసీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా వివిధ కేటగిరీలుగా ప్రభుత్వం విభజించబోతోంది.

వివిధ కేటగిరీలుగా

  • పదివేల నుంచి 24,999 మంది ఫాలోవర్లో ఉన్న వారికి 2500 వరకు పారితోషికం ఇస్తుంది.
  • 25వేల నుంచి 49 ,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి 5000 వరకు పారితోషికం ఇస్తుంది.
  • 50 వేల నుంచి 99,999 ఫాలోవర్లు ఉన్నవారికి 7,500 వరకు పారితోషికం ఇస్తుంది.
  • లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి గరిష్టంగా 15000 వరకు నగదు ప్రోత్సాహకం అందించే విధానం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది..
  • అయితే ఈ డబ్బు మొత్తం అందరికీ ఆటోమేటిక్ గా చెల్లించరు.
  • ప్రభుత్వం నిర్దేశించే అర్హతలు.. ఎం ప్యానెల్మెంట్ నిబంధనలు.. కంటెంట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది.

ఫాలోవర్ల సంఖ్యనే ఆధారంగా తీసుకోరు

ఇన్ ఫ్లూయెన్సర్లను గుర్తించే క్రమంలో కేవలం ఫాలోవర్ల సంఖ్యనే ఆధారంగా తీసుకోరు. వారి కంటెంట్.. లభిస్తున్న రీచ్.. వస్తున్న వ్యూస్.. క్రెడిబిలిటీ వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన సరిపోదు. వారు రూపొందించే కంటెంట్ నిజంగా ప్రజలకు చేరుతోందా.. ఎంతమంది వీక్షిస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎంత విస్తృతంగా తీసుకెళ్తున్నారు.. వాటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.

ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు

ఇన్ ఫ్లూయెన్సర్ల ఎం ప్యానెల్మెంట్ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. అర్హత ఉన్న కంటెంట్ క్రియేటర్లు తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిని పరిశీలించి.. అర్హత ఉన్న వారిని ప్రభుత్వం ఎంపికచేస్తుంది. ఎంపికైన వారికి ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది. ఫలితంగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను కూడా ప్రభుత్వం సమాచార వ్యవస్థల్లో ఒక ప్రత్యేకమైన వర్గంగా గుర్తించే అవకాశం ఉంది.

ప్రజలకు చేరవేసే విధంగా

ఇక ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం టీవీ, పత్రికలకు.. అధికారిక సోషల్ మీడియా ఖాతాలకు ప్రకటనలు ఇచ్చేది. అయితే ఇప్పుడు యూట్యూబ్ చానల్స్.. ఫేస్బుక్ పేజీలు.. ఇంస్టాగ్రామ్ పేజీలకు ప్రాధాన్యం లభించబోతోంది. యువత సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విధంగా ఇన్ ఫ్లూయెన్సర్ల సేవలను ప్రభుత్వం ఉపయోగించబోతోంది.

మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు అద్భుతమైన అవకాశం ప్రభుత్వం నుంచి లభించింది. ఇప్పటివరకు ఫాలోవర్లు.. వీక్షణలు.. ప్రైవేట్ బ్రాండ్ల ద్వారా కంటెంట్ క్రియేటర్లు ఆదాయం పొందుతున్నారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా కూడా వారికి నగదు లభించే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper