Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: అసైన్డ్ రైతులకు చంద్రబాబు దీపావళి కానుక..

Chandrababu Naidu: అసైన్డ్ రైతులకు చంద్రబాబు దీపావళి కానుక..

Chandrababu Naidu:ఏళ్ల సంవత్సరాల సమస్య ఇది. ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. సమస్యను పరిష్కరించాలని ఆలోచించలేదు. పైగా రైతులను రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెట్టారు. కొందరు ఈ సమస్యను సాకుగా చూపించి బ్రహ్మాండంగా దండుకున్నారు. ఇప్పటికి కూడా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో రైతులు స్వయంగా విన్నవించడంతో ముఖ్యమంత్రి మొత్తానికి దీని మీద దృష్టి సారించారు. సమస్యను పరిష్కరించడానికి నడుం బిగించారు. ఒకరకంగా ఇది రైతులకు దీపావళి కానుక లాంటిది. […]

Chandrababu Naidu:ఏళ్ల సంవత్సరాల సమస్య ఇది. ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. సమస్యను పరిష్కరించాలని ఆలోచించలేదు. పైగా రైతులను రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెట్టారు. కొందరు ఈ సమస్యను సాకుగా చూపించి బ్రహ్మాండంగా దండుకున్నారు. ఇప్పటికి కూడా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో రైతులు స్వయంగా విన్నవించడంతో ముఖ్యమంత్రి మొత్తానికి దీని మీద దృష్టి సారించారు. సమస్యను పరిష్కరించడానికి నడుం బిగించారు. ఒకరకంగా ఇది రైతులకు దీపావళి కానుక లాంటిది.

ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి పేద రైతులు అసైన్డ్ భూములు పొందారు. అయితే దీనిపై నిజ లబ్ధిదారుల నుంచి చట్టబద్ధమైన వారసులపేరుతో రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిని సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది జూలై మాసంలో రెవెన్యూ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నూతన విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో అందుబాటులో తీసుకొచ్చింది. అసైన్డ్ భూములకు సంబంధించి గతంలో వారసత్వ హక్కుల నమోదు కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. పైగా ఈ వ్యవహారంలో సుదీర్ఘమైన రెవెన్యూ ప్రక్రియలు జరిగేవి అయితే ఈ ఆలస్యాలకు స్వస్తి పలికి.. కేవలం నామమాత్రపు ఫీజు తోనే ఈ సేవలను అత్యంత పారదర్శకంగా అందుబాటులో తీసుకురావాలని.. లక్షల మంది రైతులకు ఊరట అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా తీసుకొచ్చే నిబంధన ప్రకారం అసైన్డ్ భూమిని తమ పేరుతో మార్చుకోవాలి అనుకునే రైతులు.. గ్రామ సచివాలయాలలో సుదీర్ఘంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన వారసత్వ మ్యుటేషన్ దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. దీనికి బదులుగా కుటుంబ సభ్యులు కలిసి రాసుకున్న భాగమైన పరిష్కార పత్రాలు ఆధారంగా నేరుగా రిజిస్టార్ కార్యాలయాలలోనే రిజిస్టర్ ప్రక్రియను మొత్తంగా పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఆ భూమి ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే వందరూపాయలు.. 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే వెయ్యి చొప్పున స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆటోమేటిక్ గా మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా రెవెన్యూ రికార్డులను ఐజిఆర్ఎస్.. వెబ్ ల్యాండ్ అనే నెట్వర్క్ ద్వారా అనుసంధానించారు.

అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అంటే అసైనీ వారసులు.. కొన్ని విధానాలను పాటించాలి. నిర్దిష్టమైన పాత్రలను అందించాల్సి ఉంటుంది. భూమికి సంబంధించిన అసలు యజమాని మరణించినట్టు ధృవీకరించే మరణ ధ్రువీకరణ పత్రం, డెత్ సర్టిఫికెట్.. సదరు వ్యక్తి చట్టబద్ధమైన వారసులమని స్పష్టం చేయాల్సిన ఫ్యామిలీ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. గుర్తుంచుకున్న భాగస్వామి పరిష్కార పత్రం కూడా జత చేయాలి. ఇవన్నీ ఇచ్చేస్తే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సంవత్సరాలుగా తమ తండ్రులు లేదా తాతల పేరు మీద ఉన్న అసైన్డ్ భూములను సొంత పేర్లతో మార్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన రైతులకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. వారసుల పేరుతో రిజిస్ట్రేషన్ సులభతరం కావడం వల్ల రైతులు బ్యాంకు రుణాలు పొందవచ్చు. పట్టణ పరిహారం కూడా అందుకోవచ్చు. చట్టబద్ధమైన హక్కులు పొందొచ్చు. పాత విధానాలకు స్వస్తి పలుకుతూ చంద్రబాబు తీసుకొచ్చిన ఈ మార్పు రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో ఆనందాన్ని నింపుతోంది. వారికి ముందుగానే దీపావళి వేడుకలను తీసుకొచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper