Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Flood News: నీట మునిగిన బాబు ఫ్యూచర్ సిటీ.. సాక్షి విషానికి అంతే లేదా..

Amaravati Flood News: నీట మునిగిన బాబు ఫ్యూచర్ సిటీ.. సాక్షి విషానికి అంతే లేదా..

Amaravati Flood News: అంతటి అమెరికాలో భారీగా వర్షం కురిస్తే వరద నీరు రోడ్ల మీదకి వస్తుంది. కొన్ని సందర్భాలలో వరద పెద్దపెద్ద భవంతులను ముంచేస్తుంది. మంచు తుఫాను వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రకృతి విపత్తు చోటు చేసుకున్నప్పుడు ఎంతటి అభివృద్ధి చెందిన దేశమైనా సరే తలవంచాల్సిందే. అక్కడిదాకా ఎందుకు.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గట్టిగా వర్షం పడితే కాలనీలు నీట మునిగిపోతాయి. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఇక […]

Amaravati Flood News: అంతటి అమెరికాలో భారీగా వర్షం కురిస్తే వరద నీరు రోడ్ల మీదకి వస్తుంది. కొన్ని సందర్భాలలో వరద పెద్దపెద్ద భవంతులను ముంచేస్తుంది. మంచు తుఫాను వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రకృతి విపత్తు చోటు చేసుకున్నప్పుడు ఎంతటి అభివృద్ధి చెందిన దేశమైనా సరే తలవంచాల్సిందే. అక్కడిదాకా ఎందుకు.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గట్టిగా వర్షం పడితే కాలనీలు నీట మునిగిపోతాయి. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఇక లోతట్టు ప్రాంతాలు అయితే చెప్పాల్సిన పనిలేదు. వర్షం వచ్చింది కదా.. మునిగిపోయింది కదా.. అని తెలంగాణ పాలకులు ఊరుకోవడం లేదు కదా. అభివృద్ధి చేసుకుంటూనే పోతున్నారు కదా. వరద నీరును దారి మళ్లించి.. సరికొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కదా.. ఈ విషయం సామాన్య ప్రజలకు అర్థమవుతోంది. చివరికి అక్షరాజ్ఞానం లేని వారికి కూడా తెలుస్తోంది. కానీ ఏపీలో సాక్షి మీడియాకు.. ఇంకా కొన్ని తోక మీడియా సంస్థలకు అర్థం కావడం లేదు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని అభివృద్ధిని పక్కన పెట్టారు. తెర మీదకి మూడు రాజధానులు అంటూ హడావిడి చేశారు. ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు. చివరికి రాజధాని లో ఉన్న భూములను.. ఇతర అంశాలను ఒక కులానికి అంటగట్టారు. రిషికొండను ధ్వంసం చేసి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. మూడు రాజధానులు అంటూ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన ఆయన.. అధికారం చివరి దశలో విశాఖ క్యాపిటల్ సిటీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానని ప్రకటించారు.

వాస్తవానికి ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు అమరావతి అంధకారంలో ఉంది. ఏపీ రాష్ట్రం రాజధాని లేని ప్రాంతంగా ఉండిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. సిఆర్డిఏ పరిధిలో రోడ్లు.. డ్రైనేజీలు.. ఇంటర్నెట్ కేబుల్.. వంటి వ్యవస్థలు వేగంగా సాగిపోతున్నాయి. రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిర్మాణం అవుతోంది. త్వరలో విజయవాడ.. విశాఖపట్నం నగరాలకు మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కూడా ఒక అభివృద్ధి నమూనా.. ప్రపంచంలో ఏ దేశాన్ని చూసుకున్నా సరే అభివృద్ధి అనేది ఇలాంటి విధానంలోనే కనిపిస్తుంది. చంద్రబాబుకు దూర దృష్టి ఎక్కువ కాబట్టి ఆయన మరింత ఫోకస్ పెట్టి పనులు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రయత్నానికి అడుగడుగునా ఇబ్బంది కలిగించేందుకు సాక్షి ప్రయత్నాలు చేస్తోంది. విష ప్రచారం బ్రహ్మాండంగా చేపడుతోంది. ఇటీవల మురుసు తుఫాన్ వల్ల ఏపీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చంద్రబాబు నిర్మిస్తున్న అమరావతి మాత్రమే కాదు.. గత పాలకులు నిర్మించిన అనేక భవనాలలో వరద నీరు వచ్చింది. అయినంత మాత్రాన ఆ పరిపాలకుల పనితీరును తప్పు పట్టలేము కదా. కానీ ఈ విషయంలో సాక్షి.. భూతద్దాలు కండ్లకు పెట్టుకొని అమరావతిని చూస్తోంది. వర్షం వల్ల వచ్చిన వరదనీరు అమరావతి నగరాన్ని మొత్తం ముంచేసిందట. చంద్రబాబు నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నీట మునిగిపోయిందట. అసలు ఇంతటి శాడిజం ఏంటి.. దీనిని జర్నలిజమంటారా.. ఏపీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తే.. అది రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల మీద ప్రభావం చూపిస్తుంది కదా.. అంటే రాష్ట్రానికి పెట్టుబడి రావద్దని వైసిపి కోరుకుంటున్నదా.. అంటే రాష్ట్రం గురించి చెడ్డగా ప్రచారం చేసి అధికారంలోకి రావాలని వైసిపి భావిస్తున్నదా.. అని టిడిపి నేతలు అంటున్నారు.

వైసిపి చేస్తున్న విష ప్రచారం మీద ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. భారీ వర్షాల వల్ల అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ పరిసరాలు.. రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని.. రాజధాని ప్రాంతం మొత్తం వరదతో మునిగిపోయిందని కొన్ని న్యూస్ చానల్స్.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో తీసిన గోధులలో.. చేసిన తవ్వకాలలో మీరు చేయడం మాట వాస్తవమే. అమరావతి పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ప్రస్తుతం డ్రైనేజీ.. డక్టింగ్.. అండర్ గ్రౌండ్ పనుల కోసం పెద్ద ఎత్తున గోతులు తవ్వారు. నిర్మాణాలు వేగంగా సాగిపోతున్నాయి. వర్షం నీరు నిర్మాణ పనుల గోతుల్లో నిలవడం అత్యంత సహజం. అయితే దీనిని ఆధారంగా చేసుకుని రాజధాని అంతా మునిగిపోయింది.. వరద బీభత్సం అని ప్రచారం చేయడం అతిశయోక్తి.. తప్పుడు కోణంలో చూపించడమే అవుతుంది. ఒక టీవీ ఛానల్ లో మరీ బాధ్యత లేకుండా శాఖమూరు రిజర్వాయర్ విజువల్స్ వేసి అమరావతి ముగిపోయింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరొక ఛానల్ లో డ్రైనేజీ.. డక్టింగ్ పనుల గుంతలను.. వాటిలో చేరిన నీటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఛానల్ చూసిన తప్పుడు వీడియోలను మరికొందరు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఈ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకటించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper