best premium phones: స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫీచర్లో ఉన్న వాటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నేటి కాలంలో చాలామంది ఫీచర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ధర విషయంలో పట్టించుకోవడం లేదు. అటువంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ప్రీమియం ఫోన్లను తయారు చేస్తున్నాయి. వీటి ధర 50 నుంచి 60 వేల మధ్యలో ఉంటున్నది.
సాధారణంగా ప్రీమియం ఫోన్లలో ఫీచర్లు అధికంగా ఉంటాయి. వీటి ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే చాలామందికి ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్ కొనుక్కునే స్థోమత ఉండదు. అటువంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రీమియం సెగ్మెంట్లో ఫోన్లను తయారు చేస్తున్నాయి. వీటిలో ఫీచర్లను కూడా హై ఎండ్ రేంజ్ లో అందుబాటులో ఉంచుతున్నాయి.
Oneplus 13 s 5G
ఇందులో ఉన్న లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ భారీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కు ఉపయోగపడుతుంది.. ఇందులో అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు లైఫ్ టైం డిస్ప్లే వారంటీతో వస్తుంది. కెమెరా, సౌండ్, బ్యాటరీ, ఇంకా అనేక ఫీచర్లు ఇందులో అద్భుతంగా ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ కోరుకునే వారికి ఈ ఫోన్ అత్యుత్తమమైన ఎంపిక. ఇందులో 12 జీబీ RAM ఉంటుంది. దీని ధర 59,999 రూపాయలుగా ఉంది.
Vivo x200 T
ఇందులో ఫోటోగ్రఫీ.. రిలీజ్ చేసేందుకు ప్రత్యేకంగా కెమెరా ఉంది. ఇందులో 50 మెగాపిక్సల్ త్రిబుల్ కెమెరా సెట్ అప్ ఉంది. తక్కువ వెలుతురులో కూడా స్పష్టంగా చిత్రాలను తీయవచ్చు. ఈ ఫోన్ రోజువారీ వినియోగంలో చాలా స్మూత్ గా పనిచేస్తుంది.. ఇందులో డైమన్ సిటీ ప్లస్ చిప్ సెట్ ఉంది. దీని ధర 59,999 రూపాయలుగా ఉంది.
Samsung galaxy A57 5G
ఇది దీర్ఘకాలం పాటు సాఫ్ట్వేర్, అదినాతన ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఇందులో 6.9 ఎంఎం సనని డిజైన్ ఉంటుంది. ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అందిస్తూ ఉంటుంది. దీని ధర 56,999 రూపాయలుగా ఉంది. ఇందులో అద్భుతమైన ఫ్లాగ్ షిప్ కెమెరా సెట్ అప్ ఉంది. డైమన్ సిటీ 9400 ప్లస్ చిప్ సెట్ ఇందులో ఉంది.
IQ 00 15 R 5G
ఇందులో బెస్ట్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ తో అత్యధిక సమయం ఫోన్ ఉపయోగించవచ్చు. వేగవంతంగా చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీనిద్వారా మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. హెవీ గేమింగ్, ప్రొఫెషనల్ కెమెరా, ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి వాటివి ఇందులో ఉన్నాయి. దీని ధర 53,990 రూపాయలుగా ఉంది.