Nara Lokesh: అనంతపురం జిల్లాలో రాప్తాడు ప్రాంతంలో ప్రేమ పేరుతో వేధించిన ఉన్మాది దాడి చేసిన ఘటనలో పదవ తరగతి చదువుతున్న బాలిక తీవ్రంగా గాయపడింది. రంపంతో ఆ బాలిక మీద అతడు దాడి చేయడంలో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.. ఈ నేపథ్యంలో ఆమెను సొంత సోదరిలాగా భావించిన విద్య.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆమెకు మెరుగైన వైద్యం అందేలాగా కృషి చేశారు. అంతేకాదు, బెంగళూరులోని మణి పాల్ ఆసుపత్రికి తరలించే క్రమంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అధికారులతో సమాలోచనలు చేశారు.
ఆ బాలికను పరామర్శించడానికి ఆదివారం ఆయన బెంగుళూరులో ఉన్న ఓల్డ్ హాల్ విమానాశ్రయం రోడ్డులో ఉన్న మణి పాల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ బాలికను పరామర్శించారు. బాలిక ఆరోగ్య స్థితిపై వైద్యులను అడిగారు. అనంతరం అక్కడున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. వైద్యులు బాలికకు దాదాపు 12 గంటల పాటు శస్త్ర చికిత్స చేశారని.. ఆమె ప్రాణాలను కాపాడగలిగారని పేర్కొన్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బాలిక ఆరోగ్యం ఇంకా మెరుగుపడేందుకు వచ్చే 48 గంటలు అత్యంత కీలకమని తెలుస్తోంది. అయితే బాలిక అత్యంత ధైర్యంగా ఉందని.. అందువల్లే ఆమె ఇంతటి ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఆమె కుటుంబానికి అండగా ఉంటామని.. అన్ని విధాలుగా సహాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో.. వారికి ప్రభుత్వం తరఫున కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
రాప్తాడు పాఠశాలలో శనివారం మొదటి పీరియడ్ మొదలైంది. వెంటనే గేట్లు మూసివేశారు. అయితే ఆ పాఠశాలలో భవిత సెంటర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో.. గేట్లు తెరిచారు. భవిత సెంటర్ లో పని చేయడానికి రోజూ కార్మికులు వస్తున్నారు. కార్మికుల ముసుగులో ఆ యువకుడు ఈ స్థాయిలో దారుణానికి పాల్పడ్డాడు. దాడి ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా తీసుకుంది. మరోసారి ఇటువంటి దారుణాలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ వివరించారు.
బాలికను పరామర్శించిన తర్వాత.. ఆమె కుటుంబ సభ్యులను లోకేష్ కలిశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎటువంటి అవసరం వచ్చినా సరే తనకు చెప్పాలని సూచించారు. ప్రభుత్వపరంగా మాత్రమే కాకుండా.. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ తాను.. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత అండగా ఉంటామని బాధిత కుటుంబానికి నారా లోకేష్ ధైర్యం చెప్పారు. ఆమె ఆరోగ్యం గురించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు.. వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు ఆయన వివరించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులను ఈ సందర్భంగా నారా లోకేష్ అభినందించారు. ఇటువంటి ట్రామా ఆస్పత్రి వైద్యులు ఇంతవరకు చూడలేదని.. 12 గంటల పాటు నిరంతరం శ్రమించారని.. క్షేమంగా బాలిక ఇంటికి తిరిగి వచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని లోకేష్ వివరించారు.
Visited Manipal Hospital in Bengaluru to oversee the medical care of the young girl injured in the horrific Raptadu incident. Doctors have successfully completed the necessary surgeries, and her condition is stable, though the next 48 hours remain critical. We are continuously monitoring her progress.
I assured her parents that our government and I will support them in every possible way. The culprit behind this heinous attack will face the strictest punishment under the law. Praying for her speedy and complete recovery.
— Lokesh Nara (@naralokesh) November 1, 2026