Amaravati Women: ఏపీ రాజకీయాలు( AP politics) ఇప్పుడు మండిపోతున్నాయి. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి మీడియాలో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సెగలు పుట్టిస్తున్నాయి. ఓ సీనియర్ జర్నలిస్టుగా, యాంకర్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు దానిని సమర్థిస్తూ మాట్లాడారు. దీంతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టయ్యారు. ఇంకోవైపు జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలేమిటి అన్నదానిపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డిజిపి కి ఆదేశించింది. ఈ ఘటనపై అన్ని రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారతి రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. అయితే ఇంత రచ్చ జరుగుతుంటే నాలుగేళ్ల తర్వాత చూసుకుంటాం అంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారు. ఇంకోవైపు అమరావతి మహిళలు పిశాచాలు, రాక్షసులు, సంకరత్తేగా అంటూ సజ్జల మరింత అగ్గి రాజేశారు. అయితే అమరావతి మహిళలు, చుట్టుపక్కల ఉన్నవారు వేశ్యలా? అంతలా పెద్ద మాటలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు అన్నారు. అంటే దానికి కారణం ప్రోగ్రమాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ( PMPSE) సర్వే అని తెలుస్తోంది. ఈ సర్వే ను అనుసరించి సాక్షి డిబేట్లో అంత మాటలు అనేసినట్లు సమాచారం.
* జాతీయస్థాయిలో నెంబర్ 2..
ఈ సర్వే ప్రకారం ఏపీలో 1,20,000 మంది మహిళలు వ్యభిచారం ఊబిలో ఉన్నారని తేలింది. జాతీయస్థాయిలో( National wide ) నెంబర్ 2 పొజిషన్ ఏపీ దేనట. కర్ణాటక టాప్ లో ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, ఏపీ తర్వాత ప్లేస్ లో ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఏపీలో ఆ పరిస్థితి ఉందా అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోలేదు సాక్షి మీడియా. అర్జెంటుగా అమరావతి పై బురద జల్లడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం ఆ మీడియా ప్రధాన విధి. అందుకే సాక్షి మీడియాలో మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మంట అంటించారు. దీనిని రక్తి కట్టించారు కొమ్మినేని శ్రీనివాసరావు. కానీ అడ్డంగా బుక్కయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సాక్షి మీడియాను అడ్డంగా బుక్ చేశారు.
* ఈ తరహా ప్రచారం వారికే..
కొమ్మినేని శ్రీనివాసరావు( komineni Srinivasa Rao ).. పక్కాగా జగన్మోహన్ రెడ్డి మనిషి. ఆయనకు చంద్రబాబు అన్నా.. తెలుగుదేశం పార్టీ అన్నా.. అమరావతి అన్నా కడుపు మంట అని తోటి జర్నలిస్టులే చెబుతారు. యాంకర్ ముసుగులో చెత్త చెత్త డిబేట్లు పెడుతుంటారు. డిబేట్లో పాల్గొన్న వారి కంటే ఆయనే డిసైడ్ అయిపోతారు. చంద్రబాబు వేస్ట్.. జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అని తెగ వాగుతుంటారు. కొమ్మినేని కి జర్నలిస్ట్ కృష్ణంరాజు తోడయ్యారు. అతడు సైతం అదే కంపెనీ కావడంతో.. ఏపీలో వేశ్యల సర్వే పై పండగ చేసుకున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈ క్రమంలోనే సర్వేలో చెప్పిన వేశ్యలంతా అమరావతి ప్రాంతంలో ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతటి వివాదానికి కారణమయ్యారు. అయితే జర్నలిస్ట్ కృష్ణంరాజు మాటలను బట్టి.. అమరావతిలో లక్ష మంది వేశ్యలు ఉన్నారా? అసలు అంత మంది ఉంటారా? అమరావతి జనాభా ఎంత? అది ఎలాంటి ప్రాంతం? అక్కడ ఉండేదంతా రైతులే. ఏపీ రాజధానిని అంతర్జాతీయ నగరంగా మార్చడంలో తమ భూములను త్యాగం చేసిన కుటుంబాలు అవి. అటువంటి కుటుంబాల్లో స్త్రీమూర్తులను వేశ్యలంటూ కామెంట్ చేయడంతో ఇప్పుడు అమరావతి రగిలిపోతోంది.
* కేవలం విషం చిమ్మేందుకే..
అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు గత నెలలో ప్రారంభం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ పార్లమెంట్లో చట్టం కూడా చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి వచ్చినా కదిలించలేని పరిస్థితి. అందుకే అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్నారన్న అనుమానం ప్రజల్లో ఉంది. అది తెలుసుకోలేని మూర్ఖత్వ స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అసలు జర్నలిస్టు ముసుగులో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు వాగిందే తప్పు. దానికి మద్దతుగా జగన్, సజ్జల వంటి వారు రియాక్ట్ కావడం మరింత దారుణం. నాలుగేళ్ల తర్వాత వస్తాం. మీ సంగతి చూస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు కానీ.. మహిళ లోకం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుందన్న విషయాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు మార్చలేకపోతున్నారు.