Akhanda 2 Release Date: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అఖండ 2′(Akhanda 2) చిత్రానికి సంబంధించిన టీజర్ ని నిన్న మేకర్స్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. బాలయ్య పుట్టిన రోజు కానుకగా అభిమానుల కోసం విడుదల చేసిన ఈ టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో 23 మిలియన్ కి పైగా వ్యూస్, 5 లక్షల 30 వేల లైక్స్ వచ్చాయి. సీనియర్ హీరోల క్యాటగిరీలో ఇది ఆల్ టైం రికార్డు అని నందమూరి అభిమానులు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డు ని ‘అఖండ 2’ బ్రేక్ చేసింది. అదే విధంగా లైక్స్ స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా 1 మిలియన్ మార్కుని అందుకునేలా అనిపిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ని ఈ ఏడాది సెప్టెంబర్ 25 న విడుదల చేయబోతున్నట్టు నిన్న విడుదల చేసిన టీజర్ చివర్లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విడుదల తేదీ పెద్ద వివాదాలకు దారి తీసింది. కారణం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ ‘(They Call Him OG) చిత్రం విడుదల కూడా ఆ రోజే అన్నమాట. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు వస్తాయి అనేది పచ్చి అబద్దం. కచ్చితంగా ఎదో ఒక సినిమా వాయిదా పడుతుంది. ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు. నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ తప్ప మొత్తం పూర్తి అయ్యిందట. జులై నెలలో ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఓజీ కి సంబంధించిన పనులన్నీ చకచకా జరగనున్నాయి. కానీ ‘అఖండ 2’ కి వర్క్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది.
ఓటీటీ రైట్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. థియేట్రికల్ బిజినెస్ కూడా ఇంకా జరగలేదు. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ చాలా వరకు ఉంది. ఏ యాంగిల్ లో చూసినా ఈ సినిమా సెప్టెంబర్ 25 న వచ్చే సమస్యే లేదు. ఇప్పటికే బయ్యర్స్ అందరికీ ఈ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల అవుతుందని చెప్పారట. ఓజీ తో పోటీగా వేసుకుంటే కనీసం నాలుగు రోజులైనా సోషల్ మీడియా లో కావాల్సినంత ప్రమోషన్ దొరుకుంటుందని ఇలా చేసారంటూ చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. నిన్నటి నుండి సోషల్ మీడియా ఈ రెండు సినిమాలు క్లాష్ అవుతున్నాయని మీమర్స్ చేసిన మీమ్స్ అన్నీ ఇక వేస్ట్ అయ్యినట్టే. అయినా బాలయ్య బాబు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినిమాకు అడ్డంగా ఎదురు వెళ్లారంటే మీరెలా నమ్మారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు నందమూరి అభిమానులను ఉద్దేశించి ట్రోల్స్ వేస్తున్నారు.