Huawei, xiaomi high end phones: ఈనెల 9న ఆపిల్ కంపెనీ సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో భాగంగా ఐఫోన్ కొత్త సిరీస్ లను విడుదల చేస్తోంది. ఆపిల్ కంపెనీ తొలిసారిగా ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ మీద మరింత పట్టు సాధించడానికి ఆపిల్ కంపెనీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ఆపిల్ కంపెనీ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికి హువావే.. షావోమి (Huawei xiaomi) ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం (సెప్టెంబర్ 7న) అల్ట్రా ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేశాయి. దీనికి ఐఫోన్ అల్ట్రా అని పేరు పెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. షెడ్యూళ్ళ మధ్య కనిపిస్తున్న దూకుడు.. వ్యూహాత్మకమైన ఘర్షణ.. చైనా దేశీయ మార్కెట్లో జరుగుతున్న హై ఎండ్ స్మార్ట్ ఫోన్ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం లాగా కనిపిస్తోంది.
Huawei mate XT 2: హువావే తన కొత్త తరం అల్ట్రా ప్రీమియం ట్రై ఫోల్డ్ పరికరాన్ని ఆవిష్కరిస్తోంది. రెండు ఫోల్డింగ్ మెకానిజంలను ఉపయోగించి ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది. ఇది ఒక సాధారణ ఫోన్ నుంచి పెద్ద స్క్రీన్ టాబ్లెట్ లాగా మారుతుంది. పనితీరు.. పరిమితులను అధిగమించడానికి హువావే అత్యంత వినూత్నమైన లాజిక్ ఫోల్డింగ్ చిప్ విధానాన్ని ఇందులో రూపొందించింది.
Xiaomi 18 fold ఈ కొత్త హై ఎండ్ ఫోన్.. పాస్పోర్ట్ తరహాలో వెడల్పాటి డిజైన్ కలిగి ఉంటుంది.. xiaomi స్వయంగా అభివృద్ధి చేసిన Xring 03 ప్రాసెసర్, దేశీయ CXMT మెమొరీ ఇందులో ఉంది.
ఆపిల్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఫార్మ్ ఫ్యాక్టర్ ను స్మార్ట్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇది ఎంట్రీ లెవెల్ శ్రేణి దాటవేసింది. నేరుగా ఆల్ట్రా లగ్జరీ బ్రాకెట్లోకి వెళ్తుందని విశ్లేషకులు బలంగా అంచనా వేస్తున్నారు. ఆపిల్ తీసుకొస్తున్న ఈ ఫోన్ మూసి ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఆకారంలో ఉంటుంది. తెరిచి ఉన్నప్పుడు సుమారు 8 అంగుళాల ఐప్యాడ్ మినీ పరిమాణంలో ఉండే వర్క్ స్పేస్ గా మారిపోతుంది..
ఇందులో అత్యంత ఆధునికమైన 2ఎన్ఎం A20 వంటి ప్రో చిప్ ఉంది. ఆల్ట్రా స్లిమ్ చాసిస్ నిర్వహించేందుకు ఫేస్ ఐడి.. టెలిఫోటో లెన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉండకపోవచ్చు. ఇక గ్లోబల్ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ప్రపంచంలోనే ప్రీమియం యూజర్లు ఆపిల్ కంపెనీకి ఉన్నారు. ఫోల్డబుల్ రంగంలోకి ఆపిల్ కంపెనీ ప్రవేశిస్తున్న నేపథ్యంలో దానికి కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ధరల విషయంలో ఆపిల్ కంపెనీ కాంప్రమైజ్ కాదు కాబట్టి.. తక్కువ ధరకు ఉత్పత్తులు తయారుచేసి చైనా కంపెనీలు ఆపిల్ కంపెనీని గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉంది.