Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు మింగుడుపడని వార్త

Andhra Pradesh: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు మింగుడుపడని వార్త

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడుతుంది. చంద్రబాబు దార్శనీయకమైన పరిపాలన ఆ రాష్ట్రానికి ఆయువు పట్టు లాగా మారింది. ఆయన నాయకత్వంలో ఏపీ రాష్ట్రం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా జాతీయ సగటును మించిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు జీఎస్టీ వసూళ్లు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పన్ను ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో కదలిక కొనసాగుతోంది. ముఖ్యంగా […]

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడుతుంది. చంద్రబాబు దార్శనీయకమైన పరిపాలన ఆ రాష్ట్రానికి ఆయువు పట్టు లాగా మారింది. ఆయన నాయకత్వంలో ఏపీ రాష్ట్రం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా జాతీయ సగటును మించిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు జీఎస్టీ వసూళ్లు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పన్ను ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో కదలిక కొనసాగుతోంది. ముఖ్యంగా 2026 సెప్టెంబర్ లో ఏపీ నెట్ జిఎస్టి వసూళ్లు జాతీయ వృద్ధి సగటును మించిపోయాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది.

2026 సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ నెట్ జిఎస్టి వసూళ్లు 3,182.87 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2,789.50 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే వసూళ్ల వృద్ధి 14.1 సున్న శాతంగా నమోదయింది. ఇక ఇదే సమయంలో జాతీయస్థాయిలో పోస్ట్ సెటిల్మెంట్ నెట్ జిఎస్టి వృద్ధి రేటు సాగటు 8 శాతం గా ఉంది. అంటే జాతీయ సగటుతో పోల్చి చూస్తే ఏ అభివృద్ధి గణనీయంగా నమోదయింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పరిశీలిస్తే రాష్ట్ర నెట్ జిఎస్టి వసూళ్లు 19,635.49 కోట్లకు చేరుకున్నాయి. గత ఎడాది ఇదే కాలంలో 16,760.21 కోట్లుగా వసూళ్ళు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఏకంగా 18% వృద్ధి నమోదయింది. మొత్తం కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లు కూడా సెప్టెంబర్ నాటికి 30,435.98 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 25,892.92 కోట్లుగా ఉన్నది. గత ఏడాదితో పోల్చి చూస్తే వృద్ధిరేటు ఏకంగా 18% అధికంగా నమోదయింది.

ఈ పెరుగుదలకు పన్ను చెల్లింపుల్లో మెరుగైన అనుసరణ.. కట్టుదిట్టమైన తనిఖీ.. రెవెన్యూ మానిటరింగ్.. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ వంటివి కారణాలని అధికారులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా అనలటిక్స్.. యూపీఐ లావాదేవీల విశ్లేషణ.. ఐ జిఎస్టి రివర్సల్స్ డిస్కం ఆదారిత రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ వంటి చర్యలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడంతో ఆదాయం పెరిగిపోయింది.

ప్రభుత్వ చర్యలు మాత్రమే కాకుండా.. వినియోగం.. వ్యాపార కార్యకలాపాలు.. పన్ను అనుసరణ వంటి అనేక అంశాలు కూడా జీఎస్టీ వసూళ్లకు దోహదం చేశాయని వాణిజ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జాతీయస్థాయిలో సెప్టెంబర్ 2026 లో మొత్తం స్థూల జిఎస్టి వసూళ్లు కూడా 14.7% పెరిగాయి. మొత్తంగా 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా చూస్తే జిఎస్టి వసూళ్లలో ఏపీ నమోదు చేస్తున్న అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే పరిణామం లాగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఏపీ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధిస్తుంది. సమర్థవంతమైన నాయకత్వం.. ఆర్థిక అంశాలలో పొదుపు వల్ల ఈ స్థాయిలో వసూళ్లు సాధ్యమయ్యాయి. కాగా, ఏపీ ఖజానా ఇలా కావడం.. జగన్ కు మింగుడుపడని వార్త అని టీడీపీ నాయకులు అంటున్నారు.
.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper