Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu: అంబటి రాంబాబు వైసీపీని ఇలా బుక్ చేశాడేంటి..

Ambati Rambabu: అంబటి రాంబాబు వైసీపీని ఇలా బుక్ చేశాడేంటి..

Ambati Rambabu: అధికారంలో ఉన్న వాళ్ళకంటే.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికార పక్షాన్ని విమర్శిస్తున్నప్పుడు కచ్చితంగా ఆధారాలు చూపించాలి. అప్పుడే జనాలు ఆ నాయకుల మాటలు నమ్ముతారు. అలాకాకుండా నోటికి వచ్చిందే మాట అనే లాగా విమర్శించి.. బట్ట కాల్చి మీద వేస్తామంటే.. చివరికి అభాసుపాలయ్యేది ప్రతిపక్ష నాయకులే. ఏపీలో ప్రజలు ప్రతిపక్షానికి అవకాశం లేకుండా 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు. 11 స్థానాలు గెలుచుకున్న […]

Ambati Rambabu: అధికారంలో ఉన్న వాళ్ళకంటే.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికార పక్షాన్ని విమర్శిస్తున్నప్పుడు కచ్చితంగా ఆధారాలు చూపించాలి. అప్పుడే జనాలు ఆ నాయకుల మాటలు నమ్ముతారు. అలాకాకుండా నోటికి వచ్చిందే మాట అనే లాగా విమర్శించి.. బట్ట కాల్చి మీద వేస్తామంటే.. చివరికి అభాసుపాలయ్యేది ప్రతిపక్ష నాయకులే.

ఏపీలో ప్రజలు ప్రతిపక్షానికి అవకాశం లేకుండా 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు. 11 స్థానాలు గెలుచుకున్న వైసీపీ నే అక్కడ అనధికారికంగా ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే క్రమంలో వైసిపి ప్రతి సందర్భంలోనూ విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సొంత మీడియా ముందు తీవ్రంగా రెచ్చిపోతున్నారు. కనీసం ఏ అంశం మీద మాట్లాడుతున్నారో సోయి లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.

ఏపీలో సాయి కృష్ణ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. ఏమాత్రం కూడా ఓపిక లేని వైసిపి నాయకులు రెచ్చిపోయారు. ముఖ్యంగా వైసిపి రాష్ట్ర నాయకుడు.. మాజీమంత్రి అంబటి రాంబాబు తన నోటికి పని చెప్పారు. అంతేకాదు సాయి కృష్ణ ఫోటోను బయటికి చూపించారు. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని సంచలన ఆరోపణలు చేశారు.

రాంబాబు చూపించిన ఫోటోలను నిజమైన నమ్మిన సాక్షి మీడియా గట్టిగా ప్రచారం చేసింది. కానీ లోతుగా విశ్లేషిస్తే ఆ ఫోటో సాయి కృష్ణ ది కాదు. అంబటి రాంబాబు చూపించిన ఫోటో నవీన్ రెడ్డి అనే వ్యక్తిది. స్వయంగా ఈ విషయాన్ని నవీన్ రెడ్డి మేనమామ శీను రెడ్డి బయటపెట్టారు. దీంతో కదా మొత్తం అడ్డం తిరిగింది. ఫలితంగా ఏపీలో మీడియా మొత్తం నవీన్ రెడ్డి వైపు కన్ను పెట్టింది.

ఆ నవీన్ రెడ్డి అమాయకుడు కాదు. అతడి వ్యవహారాలు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూడాల్సిందే. నవీన్ రెడ్డి.. సాయి కృష్ణ దేవినేని అవినాష్ కు ప్రధాన అనుచరులుగా ఉన్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వీరిద్దరూ రాణి తోట.. కృష్ణలంక ప్రాంతాలలో విచ్చలవిడిగా వ్యవహరించే వారని.. మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించే వారిని అక్కడి మహిళలు అంటున్నారు. సాయి కృష్ణ, నవీన్ రెడ్డి వ్యవహారం తెలిసిన తర్వాత అక్కడి మహిళలు వీధులకు వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరు ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు. మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించేవారు. ఇందులో నవీన్ రెడ్డిని మ్యాడ్ రెడ్డి అని పిలిచేవారంటే.. అతడి చేష్టలు ఎలా ఉండేవో చెప్పాల్సిన పని లేదు. అన్నట్టు వీరి గురించి ఈ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఒకవేళ అవే గనుక నిజమైతే తమ ప్రాంతాలకు పట్టిన శని మొత్తం పోయిందని రాణి తోట.. కృష్ణలంక వాసులు చర్చించుకోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper