Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh Controversy: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేసిన బండ్ల...

Bandla Ganesh Controversy: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేసిన బండ్ల గణేష్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్..

Bandla Ganesh Controversy: రీ రిలీజ్ చిత్రాల విషయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేయడం లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దిట్ట అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రీసెంట్ గానే బండ్ల గణేష్ ఈ నెల 26 న పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పవన్ […]

Bandla Ganesh Controversy: రీ రిలీజ్ చిత్రాల విషయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేయడం లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దిట్ట అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రీసెంట్ గానే బండ్ల గణేష్ ఈ నెల 26 న పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ ఈ వార్త పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇన్ స్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను షేర్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. ఇలా అభిమానులు జూన్ 26 న థియేటర్స్ లో సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతుండగా, కాసేపటి క్రితమే బండ్ల గణేష్ అభిమానుల గుండెలు బద్దలయ్యే వార్త చెప్పాడు.

ఆయన మాట్లాడుతూ ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం అపూర్వమైన స్పందనతో ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతుండడంతో , ఈ నెల 26 న రీ రిలీజ్ చెయ్యాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను. థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘పెద్ది’ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడకూడదు అనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను , గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. దీనికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇస్తూ ‘నిన్ను ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యమని మేము అడగలేదు , కానీ ఏ చిత్రాన్ని విడుదల చేస్తానని మీరే ఆశపెట్టారు , ఇప్పుడు ఆ ఆశలపై నీళ్లు జల్లుతున్నారు, ఇదెక్కడి న్యాయం’ అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

బండ్ల గణేష్ కి ఇదేమి కొత్త కాదు. 2021 వ సంవత్సరం లో ఆయన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని సెప్టెంబర్ 2 న 100 కి పైగా స్పెషల్ షోస్ తో విడుదల చేస్తానని ప్రకటించాడు. కానీ కట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 షోస్ కూడా పడలేదు. అదే విధంగా ఆయన నిర్మాణం లో తెరకెక్కిన ‘తీన్ మార్’ చిత్రాన్ని కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు , ఇప్పుడు లేటెస్ట్ గా ‘గబ్బర్ సింగ్’ కి కూడా అదే చేశాడు. ఇలా ఎన్ని సార్లు ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేస్తావు , ఈసారి నువ్వు నిజంగా రీ రిలీజ్ చేస్తానని చెప్పినా ఎవ్వరూ నమ్మరు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper