spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Cid Custody : బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుకు కోర్టులో గట్టి షాక్.. సీఐడీ...

Chandrababu Cid Custody : బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుకు కోర్టులో గట్టి షాక్.. సీఐడీ కస్టడీ

Chandrababu Cid Custody : చంద్రబాబుకు కోర్టులో గట్టి షాక్ తగిలింది. బెయిల్ కోసం ఢిల్లీ నుంచి కోట్లు పెట్టి మరీ లాయర్లను దించినా వర్కవుట్ కాలేదు. తాజాగా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చంద్రబాబును ఏపీ సిఐడి వెంటాడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును విచారణ చేపట్టాల్సి ఉందని.. ఆయన ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబును రెండు రోజులు పాటు సిఐడి కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో చంద్రబాబు తరుపు లాయర్లు ఒకరిద్దరు అందుబాటులో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. విచారణ జరిపే అధికారుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ సైతం రికార్డు చేయాలని సూచించారు.

హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేతతో చంద్రబాబు కస్టడీకి మార్గం సుగమం అయ్యింది. అయితే ఐదు రోజులపాటు సిఐడి కస్టడీ కోరగా.. ఏసీబీ కోర్టు రెండు రోజులు మాత్రమే కేటాయించింది. విచారణకు సంబంధించి వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని స్పష్టం చేసింది. విచారణ వివరాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను సోమవారం చేస్తామని చెప్పుకొచ్చింది.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందని ఆశించిన టిడిపి శ్రేణులు నిరాశకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబుకు కోర్టులో వరుసుగా దెబ్బలు తగులుతుండడంతో పార్టీ శ్రేణులు సైతం ధైర్యాన్ని కోల్పోతున్నాయి. అసలు చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదని టిడిపి సీనియర్లు సైతం తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, ఆయన కుమార్తె బ్రాహ్మణి సేవలను ఉపయోగించుకోవాలని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు చంద్రబాబు తరుపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామే లేదని.. అందులో చంద్రబాబుకు అసలు ప్రమేయం లేదని గట్టిగా నమ్ముతున్న లాయర్లు సుప్రీం కోర్టుకు వెళితే ఫలితం ఉంటుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేష్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వెనువెంటనే పిటిషన్ వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసినా సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper