Kurnool : ఆ ఊర్లో వరుసగా పశువులు మృత్యువాత పడుతున్నాయి. గత నాలుగు ఏళ్లుగా 80 ఎడ్లు, బర్రెలు చనిపోయాయి. అయితే ఇదో మిస్టరీగా మారిపోయింది. చేతబడి అని ఒకరు.. ముందు పెట్టి చంపేశారని మరికొందరు అనుమానంతో ఉండేవారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.ఆయన చర్యలు అనుమానం కలిగేలా కనిపించాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీసీ కెమెరాలు మిస్టరీని ఛేదించాయి. ఒక వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని బయటపెట్టాయి. కర్నూలు జిల్లా కమలాపురంలో గత నాలుగేళ్లలో 80 ఎడ్లు, బర్రెలు చనిపోయాయి. ఇటీవల ఓ ఇంట్లో దూడ చనిపోయింది. అయితే ఇంటి పరిసరాల్లో అమర్చిన సిసి కెమెరాలు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో గ్రామస్తులు పరిశీలించగా ఆ దూడకు అదే వ్యక్తి మందు పెట్టి చంపేసినట్లు బయటపడింది. దీంతో గ్రామస్తులంతా పశువులు చనిపోవడానికి ఆ వ్యక్తి కారణమని నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ఎడ్ల బాడుగ కోసం
గ్రామంలో శంకరాచారి అనే వ్యక్తికి ఎడ్లు ఉన్నాయి. వాటిని బాడుగకు ఇస్తుంటాడు. అయితే గ్రామంలో ఇతరుల వద్ద పశువులు ఉంటే తన బాడుగ తగ్గిపోతుందని భావించాడు. అందుకే గ్రామంలో పశువులకు విషప్రయోగం చేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న బుగ్గన శివరామిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లాడు శంకరాచారి. గోడ దూకి పశువుల దగ్గరకు వెళ్లాడు. కూడే దూడకు మందు పెట్టి అక్కడినుంచి పారిపోయాడు. ఉదయానికి ఆ దూడ చనిపోయింది. ఇవన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. దీంతో వెంటనే గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు.
* పోలీసులకు ఫిర్యాదు
గ్రామంలో 80 పశువుల మరణానికి శంకరాచారి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు శంకరాచారిని అదుపులోకి తీసుకున్నారు. సమగ్ర విచారణకు చేపట్టారు. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేవలం బాడుగ కోసమే ఈ కిరాతకానికి దిగినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఒక్క ఊరిలోనే పశువులను చంపాడా? లేకుంటే పక్క గ్రామంలో ఏమైనా అటువంటి ఘటనలు జరిగాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: A person who poisons and kills cattle for his own selfish gain
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com