Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh : నారా లోకేష్ రేంజ్ ఇదీ..

Nara Lokesh : నారా లోకేష్ రేంజ్ ఇదీ..

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ క్రేజ్ రోజురోజుకూ జాతీయ స్థాయిలో పెరుగుతోంది. తాజాగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మిజోరం సీఎంకు లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాల్‌దుహోమాను శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రికార్డు […]

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ క్రేజ్ రోజురోజుకూ జాతీయ స్థాయిలో పెరుగుతోంది. తాజాగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మిజోరం సీఎంకు లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాల్‌దుహోమాను శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

రికార్డు స్థాయిలో నామినేషన్లు.. ప్రజాస్వామ్యానికి నిదర్శనం:

మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 22,800కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పార్టీ, ప్రతి వర్గం, నలుమూలల నుంచి అభ్యర్థులు ముందుకు రావడం.. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత బలంగా వర్ధిల్లుతోందనడానికి స్పష్టమైన నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు.

విమర్శకులకు లోకేష్ మాస్ కౌంటర్:

ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడకముందే అక్రమాలు జరిగాయంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

“ఎన్నికల్లో గెలుపు క్షేత్రస్థాయిలో ఉంటుంది కానీ, పత్రికా సమావేశాల్లో కాదు. దమ్ముంటే ప్రజలను ఎదుర్కోండి.. ప్రజలే తుది ఫలితాలను నిర్ణయిస్తారు” అంటూ లోకేష్ ఘాటుగా స్పష్టం చేశారు.

కాగా, ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 28న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల వేళ లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper