Krishna River Watersకరువు రక్కసి తరిమేస్తున్న వేళ, ఎల్నినో ముప్పు తరుముతున్న తరుణంలో కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరడం తీవ్ర ఆసక్తికరంగా మారింది. నిరంతరం తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడే రాయలసీమ చిట్టచివరి ప్రాంతమైన కుప్పానికి, చరిత్రలో రెండోసారి కృష్ణా నది నీళ్లు రావడంతో అక్కడి ప్రజల, రైతుల ఆనందానికి హద్దులు లేవు.
కాలువల్లో దూకి పూజలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియోలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పట్టుదలతో కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి తీసుకువచ్చారు. కాలువల ద్వారా ప్రవహిస్తున్న కృష్ణమ్మ నీటిని చూసి రైతులు పరవశించిపోయారు. అనేక ప్రాంతాల్లో రైతులు స్వయంగా కాలువల్లోకి దూకి నీటికి పూజలు నిర్వహించారు. తమ పచ్చని పొలాలకు ప్రాణం పోసిన చంద్రబాబును వేయినోళ్లతో పొగుడుతూ, ఆనందబాష్పాలు రాల్చుతున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
తెలంగాణ రైతుల్లో కొత్త చర్చ!
మరోవైపు, ఈ ఘటన రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త చర్చకు దారితీసింది. అత్యంత తీవ్రమైన ఎల్నినో పరిస్థితుల్లో కూడా ఆంధ్రా రైతులు ఎంతో ఆనందంగా పంటలు పండించుకుంటుంటే… మరి అన్ని వసతులూ ఉన్న తెలంగాణ రైతు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నీటి వనరులు, ప్రాజెక్టులు, అవసరమైన అన్ని సౌకర్యాలూ ఉండి కూడా సకాలంలో నీటిని ఎత్తిపోసుకోకపోవడం వల్ల ఇక్కడి రైతాంగానికి నష్టం జరుగుతోందనే ఆవేదన నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.
పట్టుదల ఉంటే ఎంతటి దుర్భర ప్రాంతానికైనా నీటిని మళ్లించవచ్చని కుప్పం సెంటిమెంట్ నిరూపిస్తుండగా, నీటి యాజమాన్యం నిర్వహణ విషయంలో పాలకులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
ఏపీకి నీళ్లు..తెలంగాణకు కన్నీళ్లు
కుప్పం నియోజకవర్గానికి రెండోసారి కృష్ణా నది నీళ్లు వచ్చాయని అక్కడి ప్రజల సంబురాలు
కృష్ణా నది తెలంగాణ నుండి పారుతున్నా, ఇక్కడ ప్రాంతానికి కృష్ణా నీరు ఒడిసిపట్టకుండా వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న రైతులు https://t.co/75vMDSK9sy
— Mirror TV (@MirrorTvTelugu) October 19, 2026