American Homes: మనదేశంలో చివరికి పూరి గుడిసె అయినా.. మురికి ప్రాంతాలలో ఉన్న గృహాలు అయినా చుట్టూ ప్రహరీ ఉంటుంది. ఇక పెద్దపెద్ద గృహాల చుట్టూ అయితే అంత ఎత్తున గోడ నిర్మిస్తారు. దానిపైన ఇరుపకంచె కూడా ఏర్పాటు చేస్తారు. సోలార్ ఫెన్సింగ్ నిర్మిస్తారు.
మనదేశంలో ఇలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు అమెరికాలో గృహాలు ఎలా ఉంటాయి.. అక్కడి నిర్మాణశైలి ఎలా ఉంటుంది అనే విషయాలు పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెరికాలో లైఫ్ స్టైల్.. లివింగ్ స్టైల్.. కన్స్ట్రక్షన్ స్టైల్ వెలుగులోకి వస్తున్నాయి.. అమెరికాలో గృహాల నిర్మాణశైలి విభిన్నంగా ఉంటుంది. ఇండియాలో మాదిరిగా అంతస్తులకు అంతస్తులు కట్టుకోరు. పైగా అక్కడ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగానే గృహాల నిర్మాణం సాగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల కూడా నిబంధనలను అతిక్రమించరు.
అమెరికాలో జనాభా కంటే భూభాగం అధికంగా ఉంటుంది. అందువల్ల గృహాలు పక్కపక్కనే కాకుండా కాస్త దూరంలో ఉంటాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు అక్కడ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. పైగా ఎవరి ఇళ్లలో వారు ఉంటారు. పక్కవారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టరు. అక్కడ గన్ కల్చర్ ఉన్నప్పటికీ సాధ్యమైనంతవరకు దానిని అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. విశాలమైన స్థలాలు ఉంటాయి కాబట్టి గృహాల చుట్టూ ప్రహరి గోడలు కట్టుకోరు. ముందుగానే చెప్పినట్టు ఎవరి ఇండ్లలో వారు ఉంటారు. ఒకరి వ్యక్తిగత విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు. నైబర్స్ కి సాధ్యమైనంతవరకు రెస్పెక్ట్ ఇస్తారు. ఒకవేళ పెంపుడు జంతువులు కుక్క లేదా పిల్లుల వంటివి ఉంటే చుట్టూ ప్రహరీలు కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో అన్ని రాష్ట్రాలలో ఇలానే ఉంటుంది అని కాదు.. కొన్ని రాష్ట్రాలలో గృహాల చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. అయితే అవి కూడా అరదుగానే.
గృహాల చుట్టూ పచ్చని చెట్లను పెంచుకుంటారు. ఇండియాలో అయితే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతారు. కానీ అమెరికాలో అలా ఉండదు. ఇంటి ముందు పచ్చని లాన్ లు ఉంటాయి. వాటిని మెక్సికో నుంచి వచ్చే వర్కర్లు క్లీన్ చేస్తారు. శుభ్రం చేసినందుకు డబ్బులు చార్జ్ చేస్తారు. ఒకవేళ మెక్సికో వర్కర్లకు డబ్బులు ఇవ్వడం ఎందుకు దండగ.. అనుకునేవాళ్లు సొంతంగా వాళ్లే క్లీన్ చేసుకుంటారు.. ఇండియన్ ఎక్కువగా తమ ఇంటి పరిసరాలను తామే శుభ్రం చేసుకుంటారు. అమెరికన్లు మాత్రం అలా కాదు. మెక్సికో వర్కర్ల తోనే ఆ పని చేయిస్తారు. భూమి విస్తారంగా ఉన్నప్పటికీ.. అమెరికాలో గృహాల ధరలు తక్కువగా ఏమీ ఉండవు. పైగా అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం నిబంధనలకు అనుగుణంగా సాగుతూ ఉంటుంది.