Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్ ను లేపేయడానికి పెద్ద స్కెచ్.. ఇలా బయటపడింది

Donald Trump: ట్రంప్ ను లేపేయడానికి పెద్ద స్కెచ్.. ఇలా బయటపడింది

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ రెండోసారి ఎన్నికై ఏడాది దాటింది. 2024 చివర్లో జరిగిన ఎన్నికల సమయంలోనే ట్రంపు హత్యకు రెండుసార్లు ప్రయత్నం జరిగింది. అధ్యక్షుడు అయ్యాక ఒకసారి అటాక్ చేశారు. దీంతో భద్రత వైఫల్యం బయటపడింది. ఇక అంతా సర్దుకుంది అని భావిస్తున్న తరుణంలో ట్రంప్ కు ముప్పు ఇప్పటికీ తొలగిపోలేదని తేలింది. తాజాగా కాలిఫోర్నియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద గన్, నిషేధిత మందుతో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు […]

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ రెండోసారి ఎన్నికై ఏడాది దాటింది. 2024 చివర్లో జరిగిన ఎన్నికల సమయంలోనే ట్రంపు హత్యకు రెండుసార్లు ప్రయత్నం జరిగింది. అధ్యక్షుడు అయ్యాక ఒకసారి అటాక్ చేశారు. దీంతో భద్రత వైఫల్యం బయటపడింది. ఇక అంతా సర్దుకుంది అని భావిస్తున్న తరుణంలో ట్రంప్ కు ముప్పు ఇప్పటికీ తొలగిపోలేదని తేలింది. తాజాగా కాలిఫోర్నియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద గన్, నిషేధిత మందుతో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రెసిడెంట్ అక్కడికి రావడానికి కేవలం రెండు రోజుల ముందు జరిగిన ఈ ఘటన పొంచి ఉన్న ప్రమాదాన్ని స్పష్టం చేస్తోంది.

గోల్ఫ్ క్లబ్‌లో సంచలన అరెస్టు
కాలిఫోర్నియాలోని రాంచో పాలోస్ వెర్డెస్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ఆదివారం ఒక వ్యక్తి సెక్యూరిటీ ప్లానింగ్ కార్యకలాపాలను గమనిస్తూ, ఫోటోలు, వీడియోలు తీస్తూ తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆయన పేరు జీనైన్ జాన్ టేల్ (38). ఆయన దగ్గర 16-రౌండ్ మ్యాగజైన్‌తో హాలో-పాయింట్ మందు, కారులో లోడ్ చేసిన పిస్టల్ దొరికాయి. తర్వాత ఇంట్లో తనిఖీలు చేయగా మరిన్ని ఆయుధాలు, బాడీ ఆర్మర్, సందేహాస్పద నోట్స్ కూడా దొరికాయి. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ కలిసి విచారణ చేస్తున్నాయి. ట్రంప్ మంగళవారం అక్కడ రిపబ్లికన్ ఫండ్‌రైజింగ్ డిన్నర్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ అరెస్టు సమయానికి ఆయన రాకకు రెండు రోజుల ముందే జరిగింది. అధికారులు ప్రస్తుతం “క్రెడిబుల్ థ్రెట్” లేదని చెప్పినా, ఈ సంఘటన భద్రతా ఏర్పాట్ల లోపాన్ని మరోసారి బయట పెట్టింది.

2024 నుంచి నేటి వరకు..
2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తుండగా ట్రంప్‌పై జరిగిన కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత కూడా భద్రతా ఏర్పాట్లు మరింత కఠినం చేశారు. అయినా ఇప్పుడు మళ్లీ ఆయన స్వంత గోల్ఫ్ క్లబ్ వద్ద ఇలాంటి సంఘటన జరగడం, ఆయనపై ఉన్న వ్యతిరేకత ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నా, ఆయనపై దాడులు చేయాలనే ప్రయత్నాలు ఆగడం లేదు. ప్రస్తుతం ఇరాన్ నుంచి ట్రంప్‌కు ప్రత్యేక్ష ముప్పు ఉన్నట్లు సమాచారం వస్తోంది. ఇటీవలి సంఘటనల్లో ట్రంప్ స్వయంగా “నేను ఇరాన్ కిల్ లిస్ట్‌లో నెంబర్ వన్” అని చెప్పుకున్నారు. ఇరాన్‌తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయనపై హత్యా ప్రయత్నాలు జరగవచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సూచిస్తున్నాయి. గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ఈ అరెస్టు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఈ ముప్పుతో కలిపి చూస్తే, ట్రంప్ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో అర్థం అవుతుంది.

స్థైర్యం కోల్పోని ట్రంప్..
ఈ ఘటనలు చేసుకున్నవారి ప్రయత్నాలను బయటపెట్టాయి. అయినా ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తూ, దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు, ఫెడరల్ ఏజెన్సీల సమన్వయంతో ఈ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇది ట్రంప్ భద్రతపై ఉన్న అప్రమత్తతను, అలాగే ఆయనపై ఉన్న వ్యతిరేక శక్తుల బలాన్ని ఏకకాలంలో చూపిస్తోంది.

గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన అరెస్టు ట్రంప్‌పై నిరంతరం ఉన్న ముప్పును, 2024 అనుభవాలను, ఇరాన్ నుంచి వస్తున్న సవాళ్లను ఒకేసారి గుర్తు చేస్తోంది. అధ్యక్షుడిగా ఆయన ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు, ఆయన నిర్ణయాలు ఎంత బలంగా ఉన్నాయో, అంతే బలమైన ప్రతిఘటనను కూడా ఎదుర్కొంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper