Homeఆధ్యాత్మికంToday 16 August 2026 Horoscope: ఈ 5 రాశుల ఉద్యోగులకు శుభవార్త..

Today 16 August 2026 Horoscope: ఈ 5 రాశుల ఉద్యోగులకు శుభవార్త..

Today 16 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ధన సంబంధిత అవకాశాలు ఏర్పడతాయి. గతంలో […]

Today 16 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ధన సంబంధిత అవకాశాలు ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు రాబడులు వస్తుంటాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను ఏర్పాటు చేసుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దీంతో కుటుంబ జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ఉద్యోగులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనవసరపు విషయాలతో ఆలోచనలను పక్కదారిలో పోలివ్వకూడదు. ఉద్యోగులు తమ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. అయితే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం ఏర్పాటు చేసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్త పరిచయాలు వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకొని అదృష్టం వరిస్తుంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అయితే మాట తీరుతో ఎదుటివారిని నొప్పించకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే సంయమనంతో వెంటనే పరిష్కరించుకోవాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో దృష్టి సారించాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడడంతో వీరితో అనేక లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. కొత్త వ్యక్తులను అప్పుడే నమ్మకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడకుండా చూసుకోవాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా సాగుతారు. మనస్పర్ధలు తొలగిపోవడంతో కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది. అనుకోకుండా ధన లాభాలు పొందుతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అయ్యే అవకాశం ఉంది. అప్పులను తీరుస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడంతో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఈ ప్రాజెక్టులకు తోటి వారి సహాయం ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కొత్త రుణం తీసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు విని అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారం ఏర్పాటు చేయడానికి అవసరమైన సలహాలు తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉంటుంది. దీంతో కొన్ని పనులను సకాలంలో పూర్తిచేసి వారిని ఆకట్టుకుంటారు. లక్ష్మీ కటాక్షం ఉండడంతో ధన లాభం ఎక్కువగా ఉంటుంది. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధాలు మెరుగుపడతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలను అప్పగించొద్దు. దూర ప్రయాణాలు చేసే వారికి సొంత వాహనాల్లో వెళ్లడం కలిసి రాదు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. బకాయిలు ఉండడంతో మానసికంగా ఆందోళనతో ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు లాభాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఏర్పాటు చేసుకుంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాతపాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper