Homeఅంతర్జాతీయంAmerica: వెనెజువెలాలో అమెరికా ఏం చేస్తుంది?

America: వెనెజువెలాలో అమెరికా ఏం చేస్తుంది?

America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వెనెజువెలాపై దాడి చేసి నికోలస్‌ మదురోను కిడ్నాప్‌ చేశాడు. దీనికి కారణాలుగా మదురో ప్రభుత్వం దీర్ఘకాలంగా నిరంకుశ పాలన, ఎన్నికల మోసాలు, డ్రగ్స్‌ సరఫరా వంటి ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో మదురో ఓటమిని అంగీకరించకుండా తాను గెలిచామని ప్రకటించుకోవడంతో ట్రంప్‌ పరిపాలన పద్ధతిగా స్పందించింది. న్యూయార్క్‌ కోర్టులో ఆయన్ని దోషిగా నిలిపి అరెస్టు చేయడం దీని ఫలితం. ఇది కేవలం వ్యక్తిగత చర్య కాదు […]

America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వెనెజువెలాపై దాడి చేసి నికోలస్‌ మదురోను కిడ్నాప్‌ చేశాడు. దీనికి కారణాలుగా మదురో ప్రభుత్వం దీర్ఘకాలంగా నిరంకుశ పాలన, ఎన్నికల మోసాలు, డ్రగ్స్‌ సరఫరా వంటి ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో మదురో ఓటమిని అంగీకరించకుండా తాను గెలిచామని ప్రకటించుకోవడంతో ట్రంప్‌ పరిపాలన పద్ధతిగా స్పందించింది. న్యూయార్క్‌ కోర్టులో ఆయన్ని దోషిగా నిలిపి అరెస్టు చేయడం దీని ఫలితం. ఇది కేవలం వ్యక్తిగత చర్య కాదు వెనెజువెలా ఆయిల్‌ వనరులపై అమెరికా పట్టు బలోపేతం చేసుకోవడానికి ఒక భాగమే.

బలహీన ప్రతిపక్షం..
ప్రతిపక్ష నేత మారియా కారిణా మచాడోను అధ్యక్షురాలుగా చేయాలని అమెరికా ప్రయత్నించినప్పటికీ, ఆమెకు ప్రజాబలం లేకపోవడాన్ని ట్రంప్‌ స్వయంగా ఒప్పుకున్నారు. ఆమెకు నోబెల్‌ ప్రైజ్‌ సిఫారసు చేసినా, రాజకీయంగా బలపడలేకపోయింది. ఇప్పుడు మదురో ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్వెజ్‌ అధ్యక్షురాలుగా ఎదిగారు. ఆమె అమెరికా డిమాండ్లు ఆయిల్‌ కంపెనీల్లో పాలుపంచుకోవడం, ఆధిపత్యాన్ని ఒప్పుకుని చర్చలకు సిద్ధమవుతున్నారు. మదురో కూడా ముందే ఇలాంటి ప్రతిపాదనలు చేశారు. ఇది రెజీమ్‌ చేంజ్‌ కాకుండా, ఉన్న ప్రభుత్వాన్ని మాత్రమే మార్చుకోవడం.

అమెరికా లాజిక్‌..
ట్రంప్‌ స్పష్టంగా చెప్పారు.. ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే రెజీమ్‌ చేంజ్‌ చేస్తే ఇరాక్‌లాంటి అరాచత్వం వస్తుంది. అప్పుడు అమెరికా సైన్యం పంపాలి, ఖర్చులు భరించాలి. కాబట్టి, ఉన్న నిరంకుశ ప్రభుత్వాన్నే మేనేజ్‌ చేసి వెనెజువెలా ఆయిల్‌ను తమ చేతిలో పెట్టుకోవాలనే వ్యూహం. మదురో అరెస్టు తర్వాత కూడా ప్రభుత్వ రూపం మారలేదు. ఇదే దీనికి నిదర్శనం. ఫలితంగా, అమెరికా డిమాండ్లకు లొంగుతూ పాలన కొనసాగుతోంది.

ప్రపంచానికి సిగ్నల్‌..
విశ్లేషకులు భావిస్తున్నట్లు, మదురో అరెస్టు వెనెజువెలాలో ఏమీ మార్పు తేలేదు. ఇది అమెరికా ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, ‘తలచుకుంటే ఏమైనా చేస్తాము‘ అనే మెసేజ్‌ పంపడానికి చేసిన ఆపరేషన్‌. సౌత్‌ అమెరికాలో క్యూబా, బ్రెజిల్, మెక్సికోలను బెదిరించింది. రష్యా–చైనాకు స్పష్టమైన సూచన చేసింది. ఆయిల్‌ వనరులను సమర్థంగా హామీ చేసుకుని, రాజకీయ గందరగోళాలు లేకుండా ప్రయోజనం పొందడమే ట్రంప్‌ లాజిక్‌. ఇది ప్రపంచవ్యాప్త శక్తి సమతుల్యతకు ఒక హెచ్చరిక.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper