Homeజాతీయ వార్తలుS Jaishankar: అమెరికాకు షాక్ ఇచ్చిన జయశంకర్..

S Jaishankar: అమెరికాకు షాక్ ఇచ్చిన జయశంకర్..

S Jaishankar: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇటీవల భారత్‌ రష్యా ఆయిల్‌ కొనుగోళ్లు క్రమంగా తగ్గిస్తుందని ప్రకటించారు. అమెరికా ఆయిల్‌ కొంటుందని పేర్కొన్నాడు. దీనిపై భారత్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ట్రంప్‌ ప్రకటనపై భారత్‌లో విపక్షాలు రచ్చ చేశాయి. మోదీ భారత ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టారని ఆరోపించాయి. కానీ, ఎట్టకేలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పందించారు. జర్మనీలో జరిగిన 62వ మ్యూనిచ్‌ భద్రతా సమ్మిట్‌లో మాట్లాడారు. ప్రపంచ చమురు మార్కెట్ల సంక్లిష్టతను […]

S Jaishankar: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇటీవల భారత్‌ రష్యా ఆయిల్‌ కొనుగోళ్లు క్రమంగా తగ్గిస్తుందని ప్రకటించారు. అమెరికా ఆయిల్‌ కొంటుందని పేర్కొన్నాడు. దీనిపై భారత్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ట్రంప్‌ ప్రకటనపై భారత్‌లో విపక్షాలు రచ్చ చేశాయి. మోదీ భారత ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టారని ఆరోపించాయి. కానీ, ఎట్టకేలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పందించారు. జర్మనీలో జరిగిన 62వ మ్యూనిచ్‌ భద్రతా సమ్మిట్‌లో మాట్లాడారు. ప్రపంచ చమురు మార్కెట్ల సంక్లిష్టతను గుర్తించి, భారత్‌ ఇంధన కొనుగోళ్లలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలు, ధరలు, రిస్క్‌లను ప్రధానంగా పరిగణిస్తామని కుండ బద్ధలు కొట్టారు.

అమెరికా ఆరోపణలు
భారత్‌–అమెరికా వాణిజ్య చర్చల్లో రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత్‌ హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ట్రంప్‌ అధ్యక్షత్వంలో 25% అదనపు టారిఫ్‌లు రద్దు చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. అయితే భారత్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు.

భారత విధానం స్పష్టం..
ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగినా, ఇప్పుడు అమెరికా ఒత్తిడికి లొంగడం లేదని జైశంకర్‌ స్థిరపడ్డారు. కంపెనీలు మార్కెట్‌ డైనమిక్స్‌ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయని, రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని తెలిపారు. ఇది భారత్‌ ’వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ని ప్రతిబింబిస్తోంది.

రష్యా చమురు దిగుమతులు డిసెంబరు 2025 నాటికి మూడో స్థానానికి పడిపోయాయి, టర్కీ రెండో స్థానాన్ని సంపాదించింది. రిలయన్స్‌ వంటి కంపెనీలు ఆంక్షల భయంతో కొనుగోళ్లు తగ్గించాయి. భారత్‌ మిడిల్‌ ఈస్ట్‌ వైపు దృష్టి పెరుగుతున్నప్పటికీ, భవిష్యత్‌లో మారే అవకాశం కూడా ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper