Homeఅంతర్జాతీయంPakistan Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం వేళ పాకిస్తాన్‌కు షాకింగ్‌ గిఫ్ట్‌.. రూటు మార్చిన అజ్ఞాత...

Pakistan Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం వేళ పాకిస్తాన్‌కు షాకింగ్‌ గిఫ్ట్‌.. రూటు మార్చిన అజ్ఞాత సాయుధులు!

Pakistan Independence Day: పాకిస్తాన్‌ ఆగస్టు 14న 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది. ఈ సమయంలో ఇప్పటికే పాకిస్తాన్‌ ఆర్మీ బలూచిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌ మరణించాడన్న పుకార్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలోని అజ్ఞాత సాయు«ధులు పాకిస్తాన్‌కు షాకింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. అజ్ఞాత సాయుధులు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో హెల్మెట్‌లు, బైక్‌లు, తుపాకులతో బహిరంగంగా దాడులు చేసిన వారు ఇప్పుడు ఎలాంటి ఆయుధాలు, ఆధారాలు లేకుండా ఉగ్రవాద నాయకులను లక్ష్యంగా […]

Pakistan Independence Day: పాకిస్తాన్‌ ఆగస్టు 14న 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది. ఈ సమయంలో ఇప్పటికే పాకిస్తాన్‌ ఆర్మీ బలూచిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌ మరణించాడన్న పుకార్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలోని అజ్ఞాత సాయు«ధులు పాకిస్తాన్‌కు షాకింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. అజ్ఞాత సాయుధులు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో హెల్మెట్‌లు, బైక్‌లు, తుపాకులతో బహిరంగంగా దాడులు చేసిన వారు ఇప్పుడు ఎలాంటి ఆయుధాలు, ఆధారాలు లేకుండా ఉగ్రవాద నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవలి రోజుల్లో లష్కర్‌–ఎ–తోయిబా సీనియర్‌ కార్యకర్తల మరణాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి.

తుపాకులు లేకుండా లేపేశారు..
గతంలో అజ్ఞాత సాయుధులు ముఖాలు దాచుకుని బైక్‌లపై వచ్చి తుపాకులతో లక్ష్యాలను చంపేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ఎలాంటి ముందస్తు సూచనలు, సాక్ష్యాలు లేకుండా మరణాలు జరుగుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థలు కంగారుపడుతున్నాయి. ఐఎస్‌ఐ, పోలీసులు, ఉగ్రవాద సంస్థలు కూడా ఈ విషయంపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నాయి.

లష్కర్‌ సీనియర్‌ నేత అనుమానాస్పద మృతి..
మూడు రోజుల క్రితం లష్కర్‌–ఎ–తోయిబా సీనియర్‌ నాయకుడు ఖారీ సయీద్‌ అబ్దుల్‌ అజీజ్‌ అనుమానాస్పదంగా మరణించాడు. 2008 ముంబై దాడులకు సంబంధించిన వ్యక్తుల్లో ఒకడిగా పరిగణించబడే ఆయన ఇస్లామాబాద్‌లోని కుబా మసీదు దగ్గర మెట్లు ఎక్కుతూ కుప్పకూలిపోయాడు. ఆయన తిన్న భోజనంలో విషం కలిపారా, లేదా ముందుగానే విషప్రయోగం జరిగిందా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎలాంటి అధికారిక నివేదిక బయటకు రావడం లేదు. ఆయన కుప్పకూలుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియా నిపుణుడి హతం..
ఖారీ మరణం తర్వాత రెండు రోజులకే మరో లష్కర్‌ కార్యకర్త ఆదిల్‌ అస్లం గుండెపోటుతో మరణించాడు. ఆయన సాధారణ ఉగ్రవాది దుస్తుల్లో కనిపించేవాడు కాదు. ఆధునికంగా ఉండే ఆయన లాహోర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో విద్యార్థుల విభాగానికి బాధ్యత వహించేవాడు. అక్బారా తుల్బా పత్రికను నడుపుతూ యువకుల్లో మతోన్మాదం పెంచడం, రాడికలైజేషన్‌ చేయడం, సోషల్‌ మీడియా గ్రూపులు తయారు చేయడం ఆయన పనుల్లో భాగం.

భారత అల్లర్లను ప్రమోట్‌ చేసే గ్రూపులు..
ఇటీవల జంతర్‌మంతర్‌ నిరాహార దీక్షల సమయంలో పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వందలాది అకౌంట్లు ఎలా పనిచేశాయో గమనిస్తే ఆదిల్‌ వంటి వ్యక్తుల పాత్ర స్పష్టమవుతుంది. లష్కర్‌తో అధికారిక సంబంధం కనిపించకపోయినా, సంస్థ ఆయనను సన్నిహితుడిగా పరిగణించేది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు రోజు తిన్నవి, తాగినవి గురించి విచారణ జరుగుతోంది.

లష్కర్‌కు కొనసాగుతున్న నష్టం
గత కొన్నేళ్లలో లష్కర్‌–ఎ–తోయిబాకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులను అజ్ఞాత సాయుధులు చంపినట్లు సంస్థ స్వయంగా అంగీకరించింది. జైష్‌–ఎ–మహ్మద్‌ వంటి ఇతర సంస్థల నాయకులు కూడా ఇలాంటి దాడులకు గురయ్యారు. ఈ కొత్త పద్ధతి వల్ల ఎలాంటి ట్రేస్‌ లేకపోవడం, ముందస్తు హెచ్చరికలు లేకపోవడం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను కలవరపెడుతోంది.

పాకిస్తాన్‌లో ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదం, మతోన్మాదం పెంచే వ్యవస్థపై ఈ ఘటనలు ఒత్తిడి పెంచుతున్నాయి. అజ్ఞాత సాయుధులు ఇప్పుడు తుపాకులు, తూటాలు లేకుండానే లక్ష్యాలను సాధిస్తున్నారు. దీంతో పాకిస్తాన్‌లోని భద్రతా సంస్థలు, ఉగ్రవాద సంస్థలను ఈ ఘటనలు కలవర పెడుతున్నాయి. పాకిస్తాన్‌లోని అజ్ఞాత సాయుధులు ఉగ్రవాద మద్దతుదారులపై కొత్త రకమైన ఒత్తిడిని సృష్టిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper