Homeఎంటర్టైన్మెంట్Husharu Pittalu Movie Review: 'హుషారు పిట్టలు' ఫుల్ మూవీ రివ్యూ... బొమ్మ హిట్టా ఫట్టా...

Husharu Pittalu Movie Review: ‘హుషారు పిట్టలు’ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా ఫట్టా…

Husharu Pittalu Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలు పాన్ ఇండియాలో గొప్ప విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంటే యంగ్ హీరోలు, కుర్ర హీరోలు సైతం సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతుండటం విశేషం… ఇక యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ కి సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. అవి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ‘హుషారు పిట్టలు’ పేరుతో ప్రేక్షకుల […]

Husharu Pittalu Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలు పాన్ ఇండియాలో గొప్ప విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంటే యంగ్ హీరోలు, కుర్ర హీరోలు సైతం సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతుండటం విశేషం… ఇక యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ కి సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. అవి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ‘హుషారు పిట్టలు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఒక ఊరిలో బాగా చదువుకునే రవి(అన్షు) అనే కుర్రాడు టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వస్తాడు. ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడానికి ముందే తన పరిసర ప్రాంతాల్లో ఉండే కొంతమంది కుర్రాళ్ళు అతనికి కొన్ని అశ్లీల వీడియోలు చూపించడం స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి రవి అమ్మాయిలను పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని తిరుగుతుంటాడు. ఇక అందులో భాగంగానే చిట్టి (వాసవి గణేషన్) అనే అమ్మాయి సైతం అతనికి అట్రాక్ట్ అవుతుంది. వీళ్లిద్దరు కూడా ప్రేమించుకుంటున్నాం అనే ఒక అపోహతో హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఒక రోజు వాళ్ళు ప్రైవేట్ స్పేస్ లో ఉండగా వాళ్ల పేరెంట్స్ కి దొరుకుతారు. దాని తర్వాత ఏం జరిగింది? ఆ పేరెంట్స్ ఎలాంటి కండిషన్స్ పెట్టారు… రవి, చిట్టి ఇద్దరు ఒకటయ్యారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు ఈ సినిమాని మొదటి నుంచి కూడా యూత్ ఫుల్ సబ్జెక్టుగానే తీసుకెళ్లాడు. ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ తీసినట్టుగా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కామెడీతో పాటు ఈ సినిమాలో ఒఒకటి రెండు సాంగ్స్ కూడా బాగున్నాయి. మొత్తానికైతే ఈ సినిమాని దర్శకుడు చాలా పర్ఫెక్ట్ టెంపో లో చేర్చారు. ముఖ్యంగా పోక్సో చట్టం గురించి చాలా బాగా వివరించారు. సినిమాని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సినిమా వాల్యూస్ ఎలా ఉన్నాయి సినిమా మనం అనుకున్నట్టుగా వస్తుందా లేదా అనే ధోరణిలో దర్శకుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు సాగినట్టుగా తెలుస్తుంది. ప్రతి సీను కూడా ప్రేక్షకులను ఎక్కడ నిరశాపరచకుండా ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి…

ఇక ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపించేసరికి కొంతవరకు బోర్ కొడుతుంది. అయినప్పటికి సినిమా మాత్రం ఎక్కడ తగ్గకుండా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరో యూత్ ఫుల్ సినిమా వచ్చి సక్సెస్ ను సాధించిందనేది వాస్తవం… క్లైమాక్స్ మాత్రం ప్రతి ప్రేక్షకుడి కళ్ళల్లో కన్నీళ్లు నింపిందనే చెప్పాలి. ఇలా డిఫరెంట్ క్లైమాక్స్ ను రాసుకున్న దర్శకుడు ఈ సినిమాను స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు.

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

రవి పాత్రలో చేసిన అన్షు చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. సినిమా మొత్తం తన మీద మూవ్ అవుతున్నప్పటికి తను ఎక్కడ కూడా కంగారుపడకుండా ప్రతి సీన్లో ఎలాంటి ఎమోషన్స్ కావాలో వాటిని బ్యాలెన్స్ చేస్తూ పెర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ని పలికించాలి. ఇక చిట్టి గా నటించిన వాసవి గణేషన్ సైతం తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ముఖ్యంగా ఆమె నటన ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా వీళ్లకు సపోర్ట్ చేస్తూ సినిమాను సక్సెస్ తీరాలకు చేర్చడంలో చాలా వరకు హెల్ప్ చేశారు…

టెక్నికల్ అంశాలు

సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఎక్కడ కూడా అనవసరమైన షాట్స్ కి పోకుండా చాలా డీసెంట్ షాట్స్ తో సినిమాని చెప్పే ప్రయత్నం చేశారు. మ్యూజిక్ విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ప్రతి సాంగ్ ని కాన్సెంట్రేట్ చేసి మరి అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఆయన ఎక్కడా తగ్గలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు హైలైట్ అయిందనే చెప్పాలి… ఎడిటర్ సైతం తన వంతు ప్రయత్నం చేస్తూ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడం లో తన వంతు కృషి చేశాడు..

ప్లస్ పాయింట్స్

క్లైమాక్స్
మెయిన్ లీడ్ ఆర్టిస్టుల పర్ఫామెన్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించాయి…
హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ అంత ఎఫెక్టివ్ గా లేదు…

రేటింగ్ : 2.5/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper